Home /News /crime /

MOTHER OF VICTIM SHOCKED BY HEARING ANSWER FROM POLICE TO KNOW THE STATUS OF HER COMPLAINT AK

Mother: కూతురిపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.. అక్కడ వాళ్లు చెప్పిన సమాధానం విని షాక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కర్పగఖనిపై పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అతడిపై నమోదైన కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సరోజకు అక్కడ ఊహించని సమాధానం వచ్చింది.

    తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటారు బాధితులు. అక్కడ తమ గోడు వెళ్లబోసుకుని న్యాయం చేయమని కోరుతుంటారు. అయితే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లలోనూ బాధితులకు న్యాయం జరిగింది. పైగా అక్కడ బాధితులుగా అప్పుడప్పుడు అవమానాలు ఎదురవుతాయి. ఇలాంటి సంఘటనలు అనేక జరిగాయి. తాజాగా తమిళనాడులోని ఓ బాధిత మహిళకు దాదాపుగా ఇలాంటి ఓ అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై తిరుమంగళంకు చెందిన సరోజ(పేరు మార్చాం) అనే మహిళకు 13 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఆ తరువాత కొద్దిరోజులకు సరోజ తన కూతురు స్కూల్‌కు వెళ్లే వ్యాన్ డ్రైవర్‌ కర్పగఖనితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

    కర్పగఖని ఇటీవల సరోజ ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించేందుకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అయితే ఈ క్రమంలో సరోజ కూతురుతో అతడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మూడు నాలుగు సార్లు ఇదే రకంగా జరిగడంతో సరోజ తట్టుకోలేకపోయింది. కర్పగఖని దురుద్దేశ్యం ఆమెకు అర్థమైంది. దీంతో అతడిపై తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

    కర్పగఖనిపై పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అతడిపై నమోదైన కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సరోజకు అక్కడ ఊహించని సమాధానం వచ్చింది. ఆమెను పెద్దగా పట్టించుకోని పోలీసులు.. కేసు విచారణ చేపట్టాలంటే రూ. 5 వేల రూపాయలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు.

    KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

    kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..

    తన దగ్గర అంత డబ్బు లేదని సరోజ వారికి చెప్పింది. దీంతో వాళ్లన్న మాటలు ఆమెను మరింతగా అవమానపరిచాయి. ఒకవేళ తమకు లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోతే పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేయాలని వాళ్లు సరోజుకు సూచించారు. వారి మాటల తట్టుకోలేకపోయిన బాధితురాలు సరోజ.. ఈ విషయంపై డీసీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Harassment on women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు