news18-telugu
Updated: February 22, 2020, 10:52 PM IST
నమూనా చిత్రం
ఓ మైనర్ బాలుడితో ఇద్దరు పిల్లల తల్లి ప్రేమలో పడింది. అయితే, పిల్లలను వదిలేసి అతడిని తీసుకుని పారిపోవడానికి కూడా సిద్ధపడింది. దీంతో ఆ బాలుడు ఆంటీ బాధ తట్టుకోలేక బాలుడు తన తల్లిదండ్రులకు విషయాన్ని చేరదీశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బిలాస్పూర్లో 27 ఏళ్ల మహిళకు వివాదం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్తతో కాపురం చేసుకుంటున్న ఆమె కన్ను వారి ఇంటి పొరుగున ఉండే 17 ఏళ్ల బాలుడి మీద పడింది. ఎప్పుడైనా బాలుడు ఒంటరిగా కనిపిస్తే అతడితో చిలిపిగా మాట్లాడడం, సెక్స్ గురించి చెప్పేది. దీంతో అతడిలో కంగారు మొదలైంది. ఈ క్రమంలో ఓ రోజు సడన్‌గా తాను తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి వచ్చేస్తానని, అతడితో కలసి ఎక్కడికైనా పారిపోదామని చెప్పింది. దీంతో ఆ బాలుడి గుండె గుభేల్మంది.
ఇంటర్ చదువుతున్న కుర్రాడు... ఈ మధ్య టెన్షన్ పడుతుండడం చూసిన కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఓ రోజు తండ్రి అతడిని కూర్చోబెట్టి మెల్లగా విషయాన్ని ఆరా తీశాడు. దీంతో బాలుడు ఆ ఆంటీ పెడుతున్న టార్చర్ గురించి చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె తనను రోజూ సెక్స్ గురించి మాట్లాడుతూ రెచ్చగొడుతోందని చెప్పాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలుడిని ఆమె పెడుతున్న చిత్రహింసల గురించి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆమె నిజాన్ని అంగీకరించింది. తన భర్త మీద ఇష్టం లేదని, అందుకే ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లడానికి తాను సిద్ధపడినట్టు చెప్పింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
February 22, 2020, 10:50 PM IST