Home /News /crime /

షాక్.. 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. బెయిల్ ఇవ్వాలంటూ ఏకంగా ఆ బాలిక తల్లే..

షాక్.. 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. బెయిల్ ఇవ్వాలంటూ ఏకంగా ఆ బాలిక తల్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

16 ఏళ్ల తన కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన 25ఏళ్ల యువకుడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఓ తల్లి అఫిడవిట్ దాఖలు చేసింది. నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకుని అతడిని విడుదల చేయాల్సిందిగా కోరింది. పోలీసులు మాత్రం అతడికి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టులో వాదనలు వినిపించారు. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    తన కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి బెయిల్ ఇవ్వండంటూ ఏ తల్లయినా కోరుతుందా.? నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకుంటుందా? అస్సలు జరగనే జరగదు కదూ. కావాలంటే నిందితుడికి ఉరి శిక్ష విధించండంటూ పోరాడుతుంది తప్పితే, అతడిని విడుదల చేయమని మాత్రం అస్సలు కోరదు. కానీ ఓ చోట మాత్రం సీన్ రివర్స్ అయింది. 16 ఏళ్ల తన కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన 25ఏళ్ల యువకుడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఓ తల్లి అఫిడవిట్ దాఖలు చేసింది. నిందితుడి తరపున వకాల్తా పుచ్చుకుని అతడిని విడుదల చేయాల్సిందిగా కోరింది. పోలీసులు మాత్రం అతడికి బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టులో వాదనలు వినిపించారు. కానీ కోర్టు మాత్రం నిందితుడి, బాలిక తల్లి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఆ యువకుడికి బెయిల్ ఇచ్చింది. ముంబైలో జరిగిన ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముంబైలో ఉంటున్న ఓ 25ఏళ్ల యువకుడికి పెళ్లయింది. చక్కగా భార్యను చూసుకోకుండా పెడదోవ పట్టాడు. ఆ యువకుడికి బాగా తెలిసిన వ్యక్తి ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆ వ్యక్తికి ఓ 16ఏళ్ల కూతురు ఉంది. ఆ 16ఏళ్ల బాలికకు, ఆ యువకుడు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. దీంతో ఆ బాలిక అతడి వలలో పడింది. తనను నమ్మిన ఆ బాలికపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. దీంతో ఈ విషయం ఇంట్లో తెలిసింది. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబై పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఆ యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడు ముంబై ఫోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని మొదట ఆ కోర్టు కొట్టేసింది. కొద్ది నెలల తర్వాత మరోసారి బెయిల్ పిటిషన్ ను పెట్టుకున్నాడు.

    అయితే ఈ సారి అతడిని బెయిల్ పై విడుదల చేయాల్సిందిగా బాలిక తల్లి అఫిడవిట్ ను దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయింది. అతడు బెయిల్ పిటిషన్ ను వేయడానికి ముందే వాళ్లతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ’ప్రస్తుతం వచ్చిన గర్భాన్ని తీసేయిస్తా. బాలిక ఇప్పుడు మైనర్. 18 ఏళ్ల వయసు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటా‘ అని ఆ బాలిక తల్లిదండ్రులతో అతడు డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి బాలిక తల్లిదండ్రులు సరేనన్నారు. దీంతో అతడినే పెళ్లి చేసుకోవాలని తన కూతురు కోరుకుంటోందనీ, అతడికి బెయిల్ ఇవ్వాలని ఆ బాలిక తల్లి ఆ అఫిడవిట్ లో పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టులో పోలీసులు అతడికి బెయిల్ ఇవ్వొద్దంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే బాలిక తల్లి వేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడి మంతం బహుభార్యత్వానికి అంగీకరిస్తుందంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Husband kill wife, Mumbai crime, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు