హోమ్ /వార్తలు /క్రైమ్ /

నలుగురు పిల్లల తల్లి.. 9వ తరగతి బాలుడితో ప్రేమాయణం.. సమాజం ఒప్పుకోదని ఇద్దరూ ఆత్మహత్య

నలుగురు పిల్లల తల్లి.. 9వ తరగతి బాలుడితో ప్రేమాయణం.. సమాజం ఒప్పుకోదని ఇద్దరూ ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కూతురి వయసు 12 ఏళ్లు. ఆమె ప్రియుడు స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.

  ఆమెకు పెళ్లయింది. నలుగురు పిల్లలున్నారు. భర్త పని కోసం వేరొక ప్రాంతానికి వెళ్లి నివసిస్తాడు. పిల్లలతో హాయిగా జీవించాల్సిందిపోయి 17 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారికి తెలిసింది. అంతే అవమానంగా భావించి.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాజం ఒప్పుకోదని తెలిసి.. లోకం విడిచి వెళ్లిపోయారు. యూపీలోని గోండా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం కౌడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపర్తల గ్రామంలో ఓ మహిళ, మరో యువకుడు వేర్వేరు చోట్ల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్య ఘటనలు స్థానికంగా సంచలన సృష్టించాయి. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారింగా ఆసక్తికర విషయాలు తెలిశాయి.

  స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఛపర్తల గ్రామానికి చెందిన 35 ఏళ్ల గుడియా అలియాస్ నిరాలకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త పని నిమిత్తం వేరొక ప్రాంతంలో ఉంటున్నాడు. నిరాల మాత్రం పిల్లతో కలిసి ఊళ్లోనే నివసిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పింటూతో ప్రేమలో పడింది. ఇద్దరూ తరచూ కలిసేవారు. ఈ విషయం బంధువులకు తెలిసింది. ఆమెను మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించారు. ఊళ్లో అందరూ వీరి గురించి మాట్లాడుకోవడంతో అవమానంగా భావించింది నిరాల. ఈ సమాజం ఒప్పుకోదని తెలుసుకొని..ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. ఈ వార్త తెలిసి పింటూ కుంగిపోయాడు. ఆమె మరణించిన కొన్ని గంటల్లోనే గ్రామ శివారులోని ఓ మామిడి చెట్టుకు ఉరేసుకొని మరణించాడు.

  ఒకేసారి రెండు ఘటనలు జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే సమయంలో ప్రజల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కూతురి వయసు 12 ఏళ్లు. మరో కుమార్తె వయసు 10 ఏళ్లు. పెద్ద కుమారుడి వయసు ఎనిమిదేళ్లు కాగా.. చిన్న కొడుకు వయసు ఐదేళ్లు. ఇక ఆమె ప్రియుడు, మృతుడు పింటు కశ్యప్ ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరు సోదరులలో అతడు చిన్నవాడు. మృతులిద్దరూ ఒకే వర్గానికి చెందినవారు. ఇద్దరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. అందువల్లే తరచూ ఇద్దరు కలిసేశారని స్థానికులు తెలిపారు. కావడంతో ఇద్దరి ఇల్లు సమీపంలోనే ఉండడంతో నిత్యం కదలికలు ఉండేవి. రెండు మృతదేహాల పంచనామాను పోస్ట్‌మార్టం కోసం పంపారు పోలీసులు. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు