news18
Updated: November 13, 2020, 7:03 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 13, 2020, 7:03 AM IST
ఉద్యోగం ఇస్తానని ఆశ చూపారు. ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు రావాలని పిలిచారు. ఇది నిజమేనేమో అనుకుని ఆ మహిళ.. తన నాలుగేళ్ల కూతురితో కలిసి అక్కడకు వెళ్లింది. తాము చెప్పిన పని చేస్తే నెలకు రూ. 40 వేల జీతం ఇస్తానని ఆమెను నమ్మించారు. అయితే ఇక్కడే ఉండాలని.. ఇంటి దగ్గర్నుంచి వెళ్లి వస్తానంటే కుదరదని ఆమెతో చెప్పారు. ఆమె నమ్మింది. ఉద్యోగం ఇప్పిస్తే తన కూతురితో సహా ఇక్కడికే వచ్చేస్తానని ఆ అమాయకపు మహిళ వారికి చెప్పింది. ఆ దుండగుల పన్నాగాన్ని అంచనా వేయలేకపోయింది. ఫలితం.. పలువురు చేతిలో గ్యాంగ్ రేప్.. నాలుగేండ్ల పసికందుపైనా. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే... పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన ఒక మహిళ ఉద్యోగం కోసం వెతుకుతుంది. తనకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. కరాచీకి సమీపంలో ఉన్న కశ్మోర్ లో ఒక గ్యాంగ్ ఈ మహిళ అవసరాన్ని ఆసరాగా తీసుకున్నారు. తమ దగ్గరికి వస్తే నెలకు రూ. 40 వేల జీతమిస్తామని నమ్మబలికారు. ఎక్కువ జీతం కావడంతో ఆమె కూడా పని చేయడానికి ఒప్పుకుంది. నిందితులు ఆమెను కశ్మోర్ కు రమ్మనడంతో అక్కడకు వెళ్లింది. కూడా నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఆ మహిళ అక్కడకు వెళ్లగానే మాయమాటలు చెప్పిన దుండగులు ఆ తల్లీ కూతుళ్లపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. వారిద్దరిపైనా గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో ఆ తల్లీకూతుళ్లిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
నిందితులు అంతటితో ఊరుకోకుండా.. వాళ్లిద్దరినీ అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్ కు అమ్మేశారు. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ తల్లి కూతురును విక్రేత వద్ద నుంచి విడిపించి స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారిని విచారిస్తున్నారు. కాగా, గ్యాంగ్ రేప్ కు గురైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Published by:
Srinivas Munigala
First published:
November 13, 2020, 7:02 AM IST