హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mother Mercilessly Beating: ఛీ ఈమె ఒక అమ్మేనా.. ప్రియుడి మోజులో పసిబిడ్డపై ఉన్మాదం.. కన్నబిడ్డను హింసిస్తూ 250 వీడియోలు

Mother Mercilessly Beating: ఛీ ఈమె ఒక అమ్మేనా.. ప్రియుడి మోజులో పసిబిడ్డపై ఉన్మాదం.. కన్నబిడ్డను హింసిస్తూ 250 వీడియోలు

తల్లి కాదు.. రాక్షసి

తల్లి కాదు.. రాక్షసి

mother was ruthlessly beating her son: అమ్మ అనే పదానికి కలంకం తెచ్చింది తులసి అనే వివాహిత.. ప్రియుడి మోజులో రాక్షసిగా మారింది. కన్న బిడ్డను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా.. అలా కొడుతూ 250 వీడియోలను రికార్డు చేసింది.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...

  Extramarital Affair: కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మే రాక్షసిగా మారింది. ప్రియుడి మోజు (Extramrital Affair) లో పసిబిడ్డకు నరకం ఏంటో చూపించింది. అది ఒకటి రెండు సార్లు కాదు.. 250 సార్లు చిత్ర హింసలకు గురి చేసింది. ఆ వీడియోలను ప్రియుడికి పంపించి పైశాచిక అనందం పొందింది. ఇందంతా ప్రియుడిపై మోజుతో చేసినదే.. ముఖ్యంగా ప్రియుడి కారణంగా తరచూ బార్యాభర్తలు (Wife and Husband) మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. దీంతో తన భర్తపై కోపాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించిన ఆ అమ్మ.. అభం శుభం తెలియని తన కన్న కొడుకుపై ప్రతాపం చూపించింది. కన్న తల్లిని అన్న సంగతి మరచిపోయింది. చిన్నారిపై అఘాయిత్యనికి పాల్పడింది. అత్యంత కౄరంగా ప్రవర్తించింది. కట్టుకున్న బంధాన్ని.. పేగు తెంచుకుని పుట్టిన అనురాగాన్ని కాదనుకుని ప్రియుడి మోజులో అఘాయిత్యాలకు పాల్పడింది. గుట్టుగా కొనసాగిస్తున్న తన అక్రమ సంబంధాన్ని భర్త బహిర్గతం చేయడంతో కక్ష కట్టింది. లోకజ్ఞానం‌ ఎరుగని చిన్నారిపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా కన్న బిడ్డపై క్రూరంగా దాడి చేసిన సంఘటనలను వీడియోలుగా చిత్రించి (Video Recordeing) ఆ వీడియోలను భర్తకు, ప్రియుడికి పంపించింది. ఒకటి రెండు కాదు 250 వీడియోలు పంపింది. ఈ ఘటన తమిళనాడు (Tamilandu)లోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా (Chitoor District) రాంపల్లెకు చెందిన తులసిని తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సత్యమంగళం మండలం, మెట్టూరు గ్రామానికి చేందిన వడివేళన్ కు పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఆరేళ్ల వీరి వివాహ బంధానికి నిదర్శనంగా 4 ఏళ్ల గోకుల్, 2 ఏళ్ల ప్రదీప్ లు ఉన్నారు. అయితే వడివేళన్ సాధారణ రైతు కావడంతో నిత్యం పొలంలోనే అధిక సమయాన్ని కేటాయించే వాడు.. తులసీ చేతిలో ఉన్న మొబైల్ తో రోజూ గడిపేసేది. ఇలా ఒక రోజు తెలిసిన వ్యక్తితో తులసీకి అనుకోకుండా కలిసింది..ఒకరి ఫోన్ నెంబర్ లు మరోకరు ఇచ్చి పుచ్చుకున్నారు.. వీరి మధ్య తరచూ వాట్సప్ చాటింగ్ తో పాటుగా, మొబైల్ ద్వారా మాట్లాడుకునే వారు.  పోను పోను వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.. పొలం పనుల నుంచి ఇంటికి వచ్చిన భర్తను పట్టించుకోకుండా ఫోన్ లో నిమగ్నం అయ్యేది.. ఒకానొక రోజు ప్రియుడితో ఏకాంతంగా ఉన్న తులసిని చూసి భర్త వడివేళన్ భార్యను మందలించాడు..ఇలాంటి‌ పనులు మానుకోవాలి అంటూ హెచ్చరించి చెంప చెల్లుమనేలా బుద్ది చెప్పాడు.

  ఇదీ చదవండి: ఇవి మా సమస్యలు.. సీఎం జగన్ కు చెప్పనున్న సినీ పెద్దలు.. డేట్ ఫిక్స్

  ప్రియుడితో సంబంధం తెంచుకునేదే లేదని మొదట చెప్పిన తులసి.. తరువాత కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఆమె ఉండడంతో వడివేళన్ చూసి చూడనట్లు వదలిలేశాడు. అదే అదునుగా చేసుకున్న తులసీ ప్రియుడితో మాట్లాడుతునే కన్న బిడ్డలపై విరుచుకు పడేది వారికి తీవ్రంగా గాయాలైనా వదిలేది కాదు.. కన్న తల్లి ప్రేమను కాస్తైనా చూపక పోగా సవతి తల్లి కంటే ఘోరంగా.. రాక్షసిలా వారిపై దాడికి దిగ్గేది. ఇలా దాడి చేసిన ప్రతి సారి వీడియోలను చిత్రీకరించేది..అమ్మ కొట్టిందని కనీసం చెప్పలేని స్ధితి ఆ చిన్నారిది.. ఒకానోక రోజు ఆ చిన్నారి నోటిలో‌ నుండి రక్తం ధారగా రావడం గమనించిన వడివేళన్ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించాడు.


  ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగగా.. భార్య తులసి పరారయ్యింది. భర్తకు ముందుగానే విడాకుల పత్రాన్ని అందించిన తులసిలో మార్పు రాక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో భర్తపై కసి పెంచుకున్న ఆమె.. చిన్నారులపై అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురి చేసేది. అలా ఆమె తన బిడ్డలను చిత్ర హింసలకు గురిచేస్తున్న 250 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఆ నోట ఈ నోట చేరిన ఈ విషయం సీఎం స్టాలిన్ పేషికి చేరుకోవడంతో ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేసారు.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తులసి ఆచూకీ కోసం చిత్తూరు జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీ తెలుసుకున్న పోలీసులు తులసిని అరెస్ట్ చేశారు.. అయితే ఆమెను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల సంరక్షణకే మరెన్నో చట్టాలు రావాల్సి ఉందని ఇతర దేశాల్లో పోలిస్తే మన దేశంలో చిన్నారుల సంరక్షణకు చట్టాలు అమలులో వెనుకబడే ఉన్నాంమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Mother

  ఉత్తమ కథలు