Home /News /crime /

MOTHER LEFT HER YOUNGER DAUGHTER AND WENT AWAY WITH HER BOYFRIEND BN

బతుకుదెరువు కోసం వచ్చి.. ప్రియుడి మోజులో పడి.. ఎంత పనిచేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రసాద్ ఓ ఇంటిలో వాచ్‌మెన్‌గా పనికి కుదరగా, నిహారిక అదే ఇంటిలో పనిమనిషిగా చేరింది. అయితే వీరు అద్దెకు ఉండే ఇంటి పక్కనే ఉండే ముసులూరి కుమారిని పరిచయం చేసుకున్నారు.

    ఓ తల్లి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది. తన పడక సుఖం కోసం ప్రియుడి మోజులో పడి కన్నకూతురిని వదిలించుకుని పారిపోయింది. ఫలితంగా ఆ పాప ఏ దిక్కులేని ఆనాథగా మారిపోయింది. రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన తల్లి నేటికీ రాకపోవడంతో అభం శుభం తెలియని ఆ పాప బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. దీంతో అధికారులు ఆ పాపను చైల్డ్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిహారిక అనే ఓ మహిళ తన ఏడేళ్ల కూతురితో పాటు ప్రసాద్ అనే వ్యక్తితో హైదరాబాద్ నుంచి గుంటూరుకు బతుకుదెరువు కోసం వచ్చారు. గుంటూరులో స్థానికంగా ప్రసాద్ ఓ ఇంటిలో వాచ్‌మెన్‌గా పనికి కుదరగా, నిహారిక అదే ఇంటిలో పనిమనిషిగా చేరింది. అయితే వీరు అద్దెకు ఉండే ఇంటి పక్కనే ఉండే ముసులూరి కుమారిని పరిచయం చేసుకున్నారు.

    తరచూ అక్క అంటూ సొంత మనిషిలా దగ్గరయ్యారు. ఈ క్రమంలో పది రోజులు గడిచిన తర్వాత ఓ రోజు తాము హైదరాబాద్ వెళ్లి రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తామంటూ పాపను కూమారి వద్ద వదిలివెళ్లారు. రెండు మూడు రోజుల్లో వస్తామని చెప్పి వెళ్లి.. ఇంతవరకు తిరిగి రాలేదు. పరాయి వ్యక్తి మోజులో పడి.. కన్న కూతురిని ఇలా వదిలించుకోని వెళ్లిపోయిందా మహిళ. పాప తండ్రి సైతం ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. దాదాపు ఆరు నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో కుమారికి ఆ చిన్నారి పోషణ భారంగా మారింది.

    అసలే కుమారికి ఆరోగ్యం బాగా లేక చికిత్స పొందుతోంది. తానే కష్టకష్టంగా బతుకు వెళ్లదీస్తున్న సమయంలో పాప సాకలేక.. అలా వదిలేయలేక తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ చిన్నారుల కోసం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ గురించి కుమారికి తెలిసింది. దీంతో వదిలివెళ్లిన పాప సమాచారం పోలీసులకు చేరవేసింది. కుమారి ఇంటికి చేరుకున్న ముస్కాన్ ఆపరేషన్ టీమ్ ఆ చిన్నారిని రిస్క్యూ హోమ్‌కి పంపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Guntur

    తదుపరి వార్తలు