• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MOTHER KILLS HER 4 YEARS DAUGHTER BY THROWING HER INTO WELL IN VIZIANAGARAM SK

4 ఏళ్ల కూతురిని బావిలో పడేసి చంపిన తల్లి.. ఏపీలో ఘోరం

4 ఏళ్ల కూతురిని బావిలో పడేసి చంపిన తల్లి.. ఏపీలో ఘోరం

ప్రతీకాత్మక చిత్రం

తీవ్ర మనస్థాపానికి గురైన మహాలక్ష్మి ఆదివారం తెల్లవారుజామును పాపను తీసుకొని తమ పొలంలోని బావి వద్దకు వెళ్లింది. కూతురిని చంపేసి ఆ తర్వాత తానూ చనిపోవాలనుకుంది. పాపను బావిలో పడేసిన తర్వాత.. ఆ చిన్నారి ఆర్తనాదాలు విని భయపడిపోయింది.

  • Share this:
    భార్యాభర్తల మధ్య గొడవలకు పసిపాప బలయింది. 4 ఏళ్ల కూతురిని కన్నతల్లే బావిలో పడేసి చంపేసింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంక శ్రీను, మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐతే భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో నాలుగేళ్ల క్రితం భార్య మహాలక్ష్మిని పుట్టింటికి పంపించాడు శ్రీను. పెద్ద కూతురుతో కలిసి ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే భార్యను పుట్టింట్లో కలిశాడు.

    ఐతే పుట్టింట్లోనే మహాలక్ష్మి గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడా పాప వయసు నాలుగేళ్లు. పేరు రమ్య. అప్పటి నుంచి భార్యపై శ్రీను అనుమానం పెంచుకున్నాడు. ఆ పాప తనకు పుట్టలేదని పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచీ పుట్టింటి వద్దే ఉంటోంది మహాలక్ష్మి. పదిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం మహాలక్ష్మి చిన్నకూతురు రమ్యను తీసుకొని తాళ్లవలసలోని భర్త వద్దకు వచ్చింది. ఐతే రమ్య తనకు పుట్టలేదని.. ఆ పాపను వదిలించుకోవాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు శ్రీను.

    ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన మహాలక్ష్మి ఆదివారం తెల్లవారుజామును పాపను తీసుకొని తమ పొలంలోని బావి వద్దకు వెళ్లింది. కూతురిని చంపేసి ఆ తర్వాత తానూ చనిపోవాలనుకుంది. పాపను బావిలో పడేసిన తర్వాత.. చిన్నారి ఆర్తనాదాలు విని భయపడిపోయింది. తన ఆత్మహత్య నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఐతే పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు తమ పొలంలోనే బావిలో చిన్నారి మృతదేహం కనిపించింది. శ్రీను తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఒత్తిడితో కూతురిని తాను చంపేసినట్లు విచారణలో అంగీకరించింది మహాలక్ష్మి.
    Published by:Shiva Kumar Addula
    First published: