Home /News /crime /

MOTHER KILLED WHEN HER SON TRIED TO RAPE HER IN GUNTUR DISTRICT BN

కన్నతల్లిపైనే అత్యాచారం చేయబోయిన కొడుకు.. మరణ శాసనం రాసిన తల్లి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మద్యానికి బానిసైన ఆ యువకుడు రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు. ఆ వేధింపులు తాళలేక నాలుగు సంవత్సరాల క్రితమే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

    కోటి ఆశలతో తన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంది ఆ తల్లి. ఎంతో కష్టపడి పెంచి పెద్దచేసింది. చెట్టంత ఎదిగాడు.. తన కష్టసుఖాల్లో తోడుగా ఉంటాడని భావించింది. కానీ అతడు మత్తుకు బానిసయ్యాడు. పని చేయడం మానేశాడు. భార్య పిల్లల్నీ వదిలేశాడు. అందరూ ఛీ కొట్టే పరిస్థితి. అయినా కన్న తల్లి కదా.. ఆ తల్లి పేగు ఊరుకోలేదు. సమయానికి ఇంత తిండి పెడుతూ వస్తోంది. అయితే ఓ రోజు మద్యం మత్తులో కొడుకు నిద్రిస్తున్న తన తల్లిపైనే అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆగ్రహించిన తల్లి అతడి మరణ శాసనాన్ని రాసింది. మెడకు తాడు బిగించి చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన యువకుడు(30) ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఇద్దరు బిడ్డలు పుట్టారు. మద్యానికి బానిసైన ఆ యువకుడు రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు.

    ఆ వేధింపులు తాళలేక నాలుగు సంవత్సరాల క్రితమే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడి పోషణను మొత్తం తల్లి చూసుకుంటుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం తల్లిని వేధించేవాడు. అయినా తల్లి కొడుకును ఏమనలేదు. ఈ క్రమంలోనే ఇటీవల మద్యం మత్తులో తల్లిని తీవ్రంగా కొట్టడంతో బంధువుల ఇంటికి వెళ్లింది. వెళ్లనైతే వెళ్లింది కానీ తన కొడుకు తిండికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడోనని తల్లడిల్లింది. దీంతో తిరిగి ఇంటికి వచ్చింది.

    ఈ క్రమంలో సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై మద్యం మత్తులో ఉన్న కొడుకు అత్యాచారం చేయబోయాడు. ఏం జరుగుతుందో తెలియక ఆ తల్లి మొదట హతాశురాలైంది. ఆ వెంటనే తేరుకుని కొడుకును ఆపే ప్రయత్నం చేసింది. అయినా కొడుకు మళ్లీ మళ్లీ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ తల్లి కొడుకు కళ్లలో కారం కొట్టింది. పక్కనే ఉన్న తాడు తీసుకుని అతడి మెడకు బిగించి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Crime news, Guntur, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు