MOTHER KILLED HER SON FOR EXTRA MARITAL AFFAIR WITH LOVER IN GUJARAT HERE IS THE FULL DETAILS OF THE CRIME NEWS NK
ప్రియుడితో సంబంధం.. అడ్డుగా మూడేళ్ల చిన్నారి.. కూరగాయల కోసం వెళ్లి ఏం చేసిందంటే...
ప్రియుడితో సంబంధం.. చిన్నారి హత్య
వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదాంతాలే అవుతున్నాయి. ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కామ కోరికలు ఆమె కళ్లను మూసేశాయా... మాతృ ప్రేమకు సమాధి కట్టాయా?
అది... గుజరాత్... అహ్మదాబాద్. కూరగాయల కోసం అంటూ ఇంట్లోంచీ మూడేళ్ల కొడుకును తీసుకొని ఆ తల్లి బయటకు వెళ్లింది. కానీ కూరగాయల మార్కెట్‌కి వెళ్లకుండా ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లింది. అక్కడ ప్రియుణ్ని కలిసింది. ఇద్దరూ శృంగారంలో ఉండగా... పిల్లాడు ఏడ్వడం మొదలుపెట్టాడు. ప్రియుడికి చిరాకొచ్చింది. మన మధ్యలో ఏంటీ నస... అన్నాడు. ఆ తల్లికి కూడా చిరాకొచ్చింది... "ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటాడు... ఛిఛీ" అని విసుక్కుంది. ఆ కోపంలో ఆ పిల్లాణ్ని వదిలించుకుంటేపోద్ది అనుకుంది. ఇద్దరూ కలిసి పిల్లాణ్ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. పాలలో పురుగుల మందు కలిపారు. పట్టించారు. పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలారు. ఆనక ఇంటికి వెళ్తూ... కూరగాయలు కొని... పిల్లాణ్ని ఇంటికి తెచ్చి... మంచంపై పడుకోబెట్టి... దారిలో కొన్న కూరగాయల్ని వంటగదిలోకి తీసుకెళ్లి... ఇంటి పనుల్లో మునిగిపోయింది.
కాసేపటికి తాత వచ్చాడు. పిల్లాడితో ఆడుకుందామని ప్రయత్నిస్తే... పిల్లాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లితో సహా ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందుతూ శారదాబెన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఐతే... పిల్లాడు ఎలా చనిపోయాడో తేలాలి కదా... తేలకముందే... తల్లి హైడ్రామా మొదలుపెట్టింది. ఆ పిల్లాణ్ని ఇమ్మంటూ ఘోరంగా ఏడ్చింది. అది చూసిన డాక్టర్... అలా పిల్లాణ్ని ఇవ్వలేమనీ... పోలీసులు మాత్రమే ఇస్తారని చెప్పి... కాల్ చేశారు. కాసేపటికి వచ్చిన షాహెర్ కొతాడా నగర పోలీసులు... పోస్ట్ మార్టం జరిపించమన్నారు. అప్పుడు తేలింది... పిల్లాడి పొట్టలో పురుగుల మందు అవశేషాలు కనిపించాయి. దాంతో... ఉదయం పిల్లాణ్ని కూరగాయల మార్కెట్‌కి తల్లే తీసుకెళ్లిందని తాత చెప్పాడు. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్లో జ్యోతి నిజం ఒప్పుకుంది. జరిగింది మొత్తం చెప్పింది. దాంతో... పోలీసుల ముందే ఆమె భర్త ఆమెను చితకబాదబోతే... పోలీసులు అడ్డుకున్నారు. తన కొడుకును తల్లే చంపేసిందని తెలిసి... ఆ తండ్రి అజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. వివాహేతర సంబంధమే ఈ విషాదానికి కారణం అని తేలింది. ఎవరు చెప్పారో తెలియదుగానీ... ప్రియుడు భరత్ పార్మర్ గంట కిందటే పారిపోయాడని పోలీసులకు తెలిసింది. అతని కోసం గాలింపు చేపట్టారు. నాల్రోజుల్లో కచ్చితంగా పట్టుకుంటామని పిల్లాడి తండ్రికి మాట ఇచ్చారు. ఇలా వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో ఆరని చిచ్చు రేపి... చివరకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ప్రపంచాన్ని చూడని చిన్నారి తల్లి చేతిలోనే... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.