MOTHER KILLED HER DAUGHTER AND COMMIT TO SUICIDE BY HANGING TO THE FAN IN HYDERABAD VB
Suicide: హైదరాబాద్ లో విషాదం.. మూడేళ్ల కూతురును కడతేర్చిన తల్లి.. అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య.. అసలేం జరిగింది..
ప్రతీకాత్మక చిత్రం
Suicide: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతరును కన్న తల్లి కడతేర్చింది. అనంతరం ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దంపతుల మధ్య గొడవ ఇద్దరి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అభం శుభం తెలియని మూడేళ్ల కూతురిని చంపేసి.. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని పాత అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో చోటు చేసుకుంది. బతుకు దెరువు కోసం వీరి కుబుంబం ఒడిస్సా నుంచి వలస వచ్చి జీవిస్తున్నారు. నిత్యం భార్యభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. భర్తతో కొట్లాడి తీవ్ర మానసిన వేదన కు గురైన భార్య కన్నకూతురుని చంపి తను ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తన్నారు. మృతురాలు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిష్ణు ప్రియ(30)గా గుర్తించారు. నవ మాసాలు మోసి.. కని.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ముద్దులొలికే మూడేళ్ల పాపను చంపేసి.. ఆ తర్వాత తనూ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది.
కొన్నేళ్ల క్రితం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన భర్త సుదేందు గిరితో కలసి వచ్చి జీవిస్తోంది. సుదేందు గిరి, బిష్ణు ప్రియ దంపతులకు మూడేళ్ల కూతురు సంతానం. భర్త గిరి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆఫీసుకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగొచ్చిన తర్వాత బెడ్ రూమ్ లో భార్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. మూడేళ్ల కూతుర్ని కూడా ఆమె చంపేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనకు ముందు రోజే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావించిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా వాస్తవాలు తెసుస్తాయని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.