హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mahabubnagar: కన్న కొడుకును కొట్టి చంపిన తల్లి.. పక్కా స్కెచ్‌తో ప్రియుడితో కలిసి దారుణ హత్య

Mahabubnagar: కన్న కొడుకును కొట్టి చంపిన తల్లి.. పక్కా స్కెచ్‌తో ప్రియుడితో కలిసి దారుణ హత్య

మృతుడు వెంకటేష్

మృతుడు వెంకటేష్

Mahbubnagar: ఎవరికీ కంటపడకుండా.. వెంకటేష్ మృతదేహాన్ని ఇంటికి సమీపంలో ఉన్న మోతుకుల కుంటలో పడేశారు. ఇందుకు శ్రీనివాస్ అల్లుడు నర్సింలు కూడా సాయం చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Mahbubnagar

(సయ్యద్ రఫీ, న్యూస్ 18 తెలుగు, మహబూబ్ నగర్)

వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. పేగు బంధాలను సైతం తెంచేస్తున్నాయి. హత్యలు, అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి ఓ మహిళ తన కొడుకుని హత్యచేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోగల టంకర గ్రామానికి చెందిన పాపయ్యతో మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన దాయమ్మకు 30ఏళ్లు కిందట వివాహమైంది వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడి పేరు వెంకటేష్. అతడి వయసు 29 ఏళ్లు. అనారోగ్యంతో పాపయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. తర్వాత అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో దాయమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయం దాయమ్మ కుమారుడు వెంకటేష్‌కి తెలిసింది. అప్పటి నుంచి తన తల్లితో పాటు శ్రీనివాస్‌తో తరచూ గొడవపడుతున్నాడు. అతడి అడ్డు తొలగించుకుంటే తాము హ్యాపీగా బతకవచ్చని దాయమ్మ, శ్రీనివాస్ భావించారు. ఈ క్రమంలోనే వెంకటేష్ హత్యకు పక్కాగా ప్లాన్ చేసి.. అమలు చేశారు. వెంకటేష్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. దానిని ఆసరాగా చేసుకొని అతడిని చంపేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న వెంకటేష్‌కు ఫుల్లుగా మద్యం తాగించారు. వెంకటేష్ మద్యం మత్తులో ఉన్న సమయంలో.. అదునుచూసి అతడి తలపై కర్రలతో బలంగా కొట్టారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

ఎవరికీ కంటపడకుండా.. వెంకటేష్ మృతదేహాన్ని ఇంటికి సమీపంలో ఉన్న మోతుకుల కుంటలో పడేశారు. ఇందుకు శ్రీనివాస్ అల్లుడు నర్సింలు కూడా సాయం చేశాడు. మళ్లీ తనకు ఏమీ తెలియనట్లుగా దాయయ్మ నటించింది. తన కొడుకు కనబడడం లేదని బుధవారం స్థానికుల ముందు కంటతడి పెట్టింది. స్థానికులు, పోలీసులు వెంకటేష్ కోసం గాలిస్తున్న సమయంలోనే దాయమ్మ ఊరు విడిచి వెళ్లిపోయింది. ఆ తర్వాత శ్రీనివాస్, నర్సింహులు కూడా పారిపోయారు. ఆ తర్వాత మోతుకుల కుంటలో వెంకటేష్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంకటేష్ శవాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Mahbubnagar, Telangana

ఉత్తమ కథలు