హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mother Killed Daughter : 2 నెలల కూతురిని హత్యచేసి ఒవెన్ లో పెట్టిన తల్లి!

Mother Killed Daughter : 2 నెలల కూతురిని హత్యచేసి ఒవెన్ లో పెట్టిన తల్లి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mother Killed Daughter : కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆ ముక్కుపచ్చలారని చిన్నారి పాలిట మృత్యువైంది. 2 నెలల కుమార్తెను అతిదారుణంగా గొంతునులుమి చంపిన తల్లి..ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​ లో దాచింది.

Mother Killed Daughter : కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆ ముక్కుపచ్చలారని చిన్నారి పాలిట మృత్యువైంది. 2 నెలల కుమార్తెను అతిదారుణంగా గొంతునులుమి చంపిన తల్లి..ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​ లో దాచింది. సోమవారం ఢిల్లీలోని మాలవీయ నగర్​ లో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చిన్నారిని నిందితురాలు గొంతు నులిమి చంపిందని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో ప్రధాన నిందితురాలితో పాటు వేరెవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికురాలు ఒకరు మాట్లాడుతూ..."ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో తల్లే ఆ పసికందుని చంపేసింది. సోమవారం సాయంత్రం పొరుగింటి అబ్బాయి నిందితురాలి ఇంటికి వెళ్లాడు. ఎంత సేపు తలుపు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానం వచ్చింది. పసికందు కూడా కనిపించలేదు. నిందితురాలు తలుపుకు తాళం వేసుకుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాము. చిన్నారి కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు. చివరకి ఆ ఇంట్లోనే ఒవెన్​ లో విగత జీవిగా కనిపించింది"అని చెప్పారు.

First published:

Tags: Crime news, Delhi, Mother killed her baby

ఉత్తమ కథలు