2 రోజులు ఆగమన్నందుకు.. 7నెలల పాపతో తల్లి అఘాయిత్యం -అసలు నిజం ఇది కాదా?

మృతురాలు దీప, ఆమె పాప

భర్తను అడిగిన వెంటనే పుట్టింటికి పంపలేదన్న కోపంతో దీప తన ఏడు నెలల చిన్నారితో కలిసి ఇంటి దగ్గర్లోని బావిలో దూకేసింది. అయితే అది ఆత్మహత్య కాదని, దీపను, పాపను హత్య చేసి బావిలో పడేశారని ఆమె తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

  • Share this:
పెళ్లయిన మొదటి రోజు నుంచే అడుగడుగునా భర్త పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వచ్చిన ఓ ఇల్లాలు.. ఏళ్ల కాపురంలో ఓ పాపను కూడా కనింది. కాలం గడిచినా ఆమెలో అలజడి చల్లారలేదు.. కలహాల కాపురంలో కొన్నిసార్లు రక్తపాతాలు, ఆత్మహత్యాయత్నాలూ, బుజ్జగింపులపర్వాలూ జరిగాయి.. ఎవరికెవరూ తగ్గని పరిస్థితిలో చివరికి పసిపాను సైతం బలిచేశారు.. కర్ణాటక సరిహద్దులోని తమిళనాడు జిల్లా కేలమంగళంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన ఇది..

కేలమంగళం జిల్లా అంచెట్టి తాలూకా మేటుకొటాయ్ గ్రామానికి చెందిన వెంకటేశ్ కు మూడేళ్ల కిందట దీప అనే యువతితో పెళ్లయింది. తొలి రోజు నుంచే వాళ్ల కాపురంలో కలహాలు కొనసాగాయి. భర్తతో గొడవలు తారా స్థాయికి చేరడంతో రెండేళ్ల క్రితం దీప ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగిన ఆమెను కుటుంబీకులు సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఘటన తర్వాత భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లపాటు విడిపోయారు. ఆ తర్వాత

దీప తొలిసారి ఆత్మహత్యకు ప్రయత్నించిన కొద్ది రోజుల తర్వాత భర్త వెంకటేశ్ తిరిగి ఆమెను కాపురానికి తీసుకెళ్లాడు. వాళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం ఆ పాప వయసు ఏడు నెలలు. భార్యభర్తల మధ్య ఇటీవల మళ్లీ గొడవలు మొదలయ్యాయి. వెంటనే తనను పుట్టింటికి తీసుకెళ్లాలని దీప భర్తను కోరింది. అయితే, అర్జెంట్ పని ఉండటం వల్ల రెండు రోజులు తర్వాత వెళదామని భర్త సర్జిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమాదానంతో దీపకు చిర్రెత్తుకొచ్చింది. ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది..

భర్తను అడిగిన వెంటనే పుట్టింటికి పంపలేదన్న కోపంతో దీప తన ఏడు నెలల చిన్నారితో కలిసి ఇంటి దగ్గర్లోని బావిలో దూకేసింది. ఇంట్లో తల్లీపిల్లల అలికిడి లేకపోవడంతో కంగారుపడ్డ వెంకటేశ్, ఇతర కుటుంబీకులు చుట్టు పక్కల గాలించగా.. దీప, చిన్నారి బావిలో శవాలై కనిపించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అంచెట్టి పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, దీప ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి బావిలో పడేశారని ఆమె తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీబిడ్డల మృతికి ఆత్మహత్యే కారణమా, ఇంకేదైనా జరిగిందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది..
Published by:Madhu Kota
First published: