విశాఖ జిల్లాలో దారుణం... చిన్నారిని నరికి చంపి రక్తం తాగిన మేనత్త

కొంతకాలంగానే భర్త, పిల్లల్ని వదిలి పుట్టింటికి వచ్చింది రస్మో. కొంతకాలంగా ఆమె తమ్ముడు ఇంట్లోనే ఉంటుంది.కట్టెల కోసం వెళ్దామని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లింది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:35 PM IST
విశాఖ జిల్లాలో దారుణం... చిన్నారిని నరికి చంపి రక్తం తాగిన మేనత్త
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:35 PM IST
వినేందుకే ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ల బాలికను ఓ అత్త నరికి చంపింది. మేనత్త వంతాల రస్మో కట్టెల కోసం వెళ్దామని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లింది. కొండపై చిన్నారిని నరికి చంపి రక్తం తాగింది. కొంతకాలంగానే భర్త, పిల్లల్ని వదిలి పుట్టింటికి వచ్చింది రస్మో. కొంతకాలంగా ఆమె తమ్ముడు ఇంట్లోనే ఉంటుంది. అయితే రస్మోకు మద్యం సేవించే అలవాటు ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గతకొంతకాలంగా ఆమెను తన భర్త దగ్గరకు వెళ్లిపోవాలని చెబుతున్నప్పటికీ ఆమె వెళ్లకుండా తమ్ముడు వద్దే ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రస్మో అభం శుభం తెలియని చిన్నారిని అతి దారుణంగా హత్య చేయడంతో... స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవికూడా చూడండి:
ఆడుకుంటూ వెళ్లి కరెంట్ షాక్‌కు గురై ఆరేళ్ల చిన్నారి మృతిFirst published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...