Mother in law and son in law commit sucide : పశ్చిమ రాజస్తాన్(Rajastan)లోని బార్మర్(Barmer) జిల్లాలో మరోసారి సామూహిక ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. 40 ఏళ్ల మహిళ తన 25 ఏళ్ల అల్లుడితో కలిసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు(Sucide) పాల్పడింది. వీరిద్దరి మధ్య ఎఫైర్(Affair) నడుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇరువురి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బార్మర్ జిల్లాలో నివసించే ఓ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది. అయితే అతడి కన్ను పిల్లనిచ్చిన అత్తపై పడింది. ఆమె కూడా అతడిపై మనసుపడింది. ఇద్దరి మధ్య కొద్ది నెలలుగా ఎఫైర్ నడుస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదుకానీ మంగళవారం లంగేరా ఫాంటా ప్రాంతానికి సమీపంలో అత్త, అల్లుడు ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలను బార్మర్-రామ్‌సర్ రహదారి గుండా వెళుతున్న డ్రైవర్లు గుర్తించారు. వెంటనే స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తోందని..ఈ క్రమంలోనే వారిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. మృతులిద్దరి నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బంధువులు వచ్చిన తర్వాత వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
అయితే బార్మర్ జిల్లా ఆత్మహత్యలకు రాజధానిగా మారుతుండటం గమనార్హం. ఇక్కడ ఆత్మహత్యలు, సామూహిక ఆత్మహత్యల కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో పోలీసు యంత్రాంగం కూడా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ ప్రాంతంలో ప్రేమ వ్యవహరాల కారణంగా ఆత్మహత్యల కేసులు కూడా పెరుగుతున్నాయి. అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు తెరపైకి వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extramarital affairs, Rajastan