అతనికి ఏడాది క్రితం పెళ్లైంది. భార్య 9 నెలల నిండు గర్భిణి. పుట్టింట్లో ఉన్న ఆమెను చూసేందుకు తరచుగా అత్తారింటికి వెళుతుండేవాడు. ఆ క్రమంలో భార్య తల్లితో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. కూతురికి తెలియకుండా అల్లుడు, అత్త బయట కలుసుకునేవారు. వావివరుసలు మరిచి కొనసాగిన ఈ వివాహేతర సంబంధం కారణంగా ఆ అల్లుడి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని వెప్పూరు సమీపంలోని కలత్తూరు గ్రామానికి చెందిన పవిత్ర, వేల్మురుగన్(27) భార్యాభర్తలు. ఇద్దరికీ ఏడాది క్రితం వివాహమైంది. పవిత్రతో వేల్మురుగన్ సాఫీగా సాగిపోతుండేది. ప్రస్తుతం పవిత్ర తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉంది. భార్య గర్భం దాల్చడంతో కొన్ని నెలల క్రితం ఆమెను వెప్పూరులోని పుట్టింట్లో వదిలేసి వేల్మురుగన్ అప్పుడప్పుడూ ఆమెను చూసేందుకు వెళుతూ ఉండేవాడు. ఆ క్రమంలో పవిత్ర తల్లి కుముదా(45)తో ఆమె అల్లుడు వేల్‌మురుగన్‌కు చనువు పెరిగింది.
ఇద్దరూ అత్తాఅల్లుడన్న సంగతి మరిచి పవిత్రకు తెలియకుండా బయట కలుస్తూ వివాహేతర సంబంధం కొనసాగించారు. అత్తతో అఫైర్ పెట్టుకున్న వేల్మురుగన్ భార్య పవిత్రను చూసేందు కంటే కుముదాతో గడిపేందుకు తరచుగా వెళుతుండేవాడు. ఇదే క్రమంలో.. అక్టోబర్ 28న కూడా వేల్మురుగన్ తన అత్తను కలుసుకునేందుకు రాత్రి 11 దాటిన తర్వాత ఆమె ఇంటికెళ్లాడు. ఆ సమయానికి పవిత్ర ఇంట్లోని మరో గదిలో నిద్రపోతూ ఉంది. భర్త వచ్చిన సంగతి కూడా ఆమెకు తెలియదు.
అల్లుడిని గమనించిన అత్త ఈ సమయంలో ఎందుకు వచ్చావని, పక్క గదిలోనే పవిత్ర నిద్రపోతోందని.. చూస్తే ఇబ్బందవుతుందని చెప్పింది. అయితే.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వేల్మురుగన్ బయటకు రావాలంటే రావాలని అత్త కుముదాను బలవంతం చేశాడు. రాకపోతే.. అరిచి గోల చేస్తానని అల్లుడు నానా రచ్చ చేయడంతో, విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందని భావించిన అతని అత్త ఏం చేయాలో పాలుపోక క్షణికావేశంలో అతని గొంతుకు చీరతో ఉరి బిగించింది. కాసేపటికే వేల్ మురుగన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. కంగారు పడిన అతని అత్త అప్పటికప్పడు కొత్త నాటకానికి తెర లేపింది. ఇంటికొచ్చిన అల్లుడు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడని కంగారుగా కూతురి దగ్గరకు వెళ్లి చెప్పింది. పవిత్ర తల్లితో కలిసి భర్తను ఆసుపత్రికి తరలించింది. రాత్రి 11.45 నిమిషాల సమయంలో వేల్మురుగన్ అనారోగ్యంతో తమ ఇంట్లో కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలిస్తున్నామని అతని తల్లి మలర్కొడికి పవిత్ర కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. అతని తల్లి వెప్పూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన బయల్దేరి వెళ్లింది. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
వేల్మురుగన్ తల్లి తన కొడుకు మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వేల్మురుగన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వేల్మురుగన్ ఉరేసి చంపబడినట్లు తేలింది. పవిత్రను, ఆమె తల్లి కుముదను పోలీసులు విచారించారు. కుముద పోలీసు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించింది. అల్లుడు వేల్మురుగన్తో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నానని.. రాత్రి సమయంలో ఇంటికొచ్చి బయటకు రావాలని బలవంతం చేశాడని.. ఇప్పుడు వద్దని.. ఇంట్లో పవిత్ర ఉందని చెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక కంగారులో చీరతో ఉరి బిగించినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. కుముద భర్త రవిచంద్రన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇలా వావివరుసలు మరిచి తల్లి కొనసాగించిన వివాహేతర సంబంధం కూతురు జీవితంలో నిప్పులు పోసింది. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని దూరం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Son in law, Tamilnadu