Home /News /crime /

Andhra Pradesh: తల్లి ప్రియుడే హంతకుడు.. చిన్నారి సింధుశ్రీ హత్య కేసులో సంచలన విషయాలు

Andhra Pradesh: తల్లి ప్రియుడే హంతకుడు.. చిన్నారి సింధుశ్రీ హత్య కేసులో సంచలన విషయాలు

సింధుశ్రీతో వరలక్ష్మి (ఫైల్ ఫొటో)

సింధుశ్రీతో వరలక్ష్మి (ఫైల్ ఫొటో)

‘అమ్మ’ దేవుడిచ్చిన వరం.. కానీ అలాంటి పదానికే అర్థం మార్చేస్తున్నారు కొందరు.. మూడేళ్ల చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లి.. తన ప్రియుడు కన్న కూతుర్ని హత్య చేస్తుంటే కనీసం అడ్డుచెప్పలేకపోయింది.. తమ కోరికలు తీర్చుకునేందుకు అడ్డు వస్తోందనే చిన్న కారణంతో చిన్నారిని హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు.

ఇంకా చదవండి ...
  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18                                          ఏపీలో సంచలనం సృష్టించిన చిన్నారి సింధుశ్రీ హత్య కేసు మిస్టరీ పోలీసులు చేధించారు. మొదటి నుంచి అనుమానిస్తున్నట్టు తల్లి ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి సింధుశ్రీని జగదీష్‌ హత్య చేసినట్లు విశాఖ పోలీసుల నిర్థారించారు. తమ కోర్కెలు తీర్చుకోడానికి అడ్డు వస్తోందని ఒకే ఒక్క కారణంగా.. ముద్దులు ఒలికించే చిన్నారి అని చూడకుండా.. కర్రతో కొట్టి చంపాడు నరరూప రాక్షుసుడు. అయితే ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు అనారోగ్యంతో చనిపోయినట్లు నిందితులు చిత్రీకరించే యత్నం చేసినట్టు పోలీసులు చెప్పారు. నేరాన్ని నిందితుడు అంగీకరించడంతో జగదీష్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా పోలీసులు మార్చారు. 24గంటల్లో పోస్టుమార్టం నివేదిక రానుంది.

  ఈ హత్య కేసులు.. జగదీష్ ప్రధాని నిందితుడు అని తేలినా.. సింధుశ్రీ తల్లి వరలక్ష్మి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. సింధుశ్రీ తల్లి వరలక్ష్మిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు తెలిసే అంతా జరిగిందా... లేక హత్యకు పథకం వేసింది ఆమేనా..? హత్య చేసిన సమయంలో ప్రియుడికి సాయం పడిందా..? లేక తానే హత్య చేసి.. ప్రియుడిని దోషిని చేస్తోందా..? లాంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

  బొద్దాన రమేష్, బొద్దాన వరలక్ష్మి(25)లకు పెళ్లి అయి 5 సంవత్సరాలు అయింది. వీరిద్దరికీ పాప పుట్టింది. ఆ పాపకు సింధుశ్రీ అని పేరు పెట్టుకుని కొన్నిరోజులు అల్లారుముద్దుగా చూసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి సింధుశ్రీ మూడు సంవత్సరాలు. అయితే.. వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె భర్త చెబుతున్నాడు. తన భార్య వరలక్ష్మి మీద, బోర జగదీష్ రెడ్డి మీద తనకు అనుమానం ఉందని.. మూడు నెలలు ఉన్నప్పుడు తన దగ్గర నుంచి కూతురు సింధుశ్రీని తీసుకువెళ్లిపోయిందని బొద్దాన రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తన కూతురిని చంపేసి పూడ్చిన తర్వాత తన భార్య ఫోన్ చేసి చెప్పిందని రోదిస్తూ తన కూతురికి న్యాయం చేయాలని మీడియాని, పోలీసులను కోరాడు.

  ఇదీ చదవండి: ఎంపీ రఘురామ కేసులో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసులు

  చిన్నారిని కిరాతకంగా హత్య చేసి.. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసినా.. వారు చేసిన పొరపాటే నిందితులుగా గుర్తించేలా చేసింది. చిన్నారి సింధూశ్రీ మృతికి సంబంధించిన కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు జరిపారు. కన్నతల్లి వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌రెడ్డి రెండో కంటికి తెలియకుండా చిన్నారి మృతదేహాన్ని రాత్రికి రాత్రే మారికవలస శ్మశానంలో కప్పిపెట్టడాన్ని బట్టి చిన్నారిది సహజ మరణం కాక పోవచ్చునని, ఆ దిశగా నిందితులు వరలక్ష్మి, జగదీశ్వర రెడ్డిలను సీఐ రవికుమార్‌ విచారించారు. అలాగే వారి కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. కాగా తన కుమార్తెను భార్య వరలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగదీష్‌ రెడ్డి హత్యచేశారని బోరవానిపాలేనికి చెందిన చిన్నారి తండ్రి బొద్దాన రమేష్‌ ఫిర్యాదు చేయడంతో అతడిని ప్రధానంగా పోలీసులు విచారణ చేశారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు