హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడితో తల్లి రొమాన్స్..... కళ్లారా చూసిన కూతురు.. ఆ తర్వాత..

ప్రియుడితో తల్లి రొమాన్స్..... కళ్లారా చూసిన కూతురు.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కర్నాల్‌లో నివాసముంటున్న లక్ష్మీ ... అమిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. లక్ష్మీకి సోనమ్ అనే పదేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సోనమ్ ఆడుకునేందుకు బయటకు వెళ్లింది.

తన తల్లి వివాహేతర బంధాన్ని కళ్లారా చూసిన కూతుర్ని కాటికి పంపింది ఓ కసాయి తల్లి. తన గుట్టును ఎక్కడ తండ్రికి చెబుతుందో అని పదేళ్ల కూతుర్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని కర్నాల్‌ పట్టణంలోలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

కర్నాల్‌లో నివాసముంటున్న లక్ష్మీ ... అమిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. లక్ష్మీకి సోనమ్ అనే పదేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సోనమ్ ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. దీంతో లక్ష్మీ ప్రియుడు అమిత్‌ను ఇంటికి పిలిపించుకుంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వేళ... సోనమ్ ఇంటికి వచ్చింది. తల్లి చేసిన బాగోతాన్ని చూసి తండ్రికి చెబుతానంది సోనమ్. దీంతో కూతురు ఎక్కడ తన బండారం బయటపెట్టేస్తుందోనని భయపడిన లక్ష్మీ, ప్రియుడి అమిత్‌తో కలిసి సోనమ్ గొంతు నొక్కి చంపేసింది. కూతురు మృతదేహాన్ని తీసుకెళ్లి నదిలో పడేసింది.

ఆతర్వాత ఏం తెలియనట్లు.. కూతురు కనిపించడం లేదంటూ భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నదిలో సోనమ్ మృతదేహం లభ్యం కావడంతో... పోలీసులు పోస్టుమార్టమ్ నిర్వహించారు. హత్యే అని రిపోర్ట్ వచ్చింది. దీంతో తల్లి లక్ష్మీపై అనుమానం రావడంతో తమదైన స్ట్టైల్లో విచారించారు. కూతుర్ని హత్య చేసింది తానే అంటూ ఒప్పుకుంది. దీంతో లక్ష్మీ, అమిత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

First published:

Tags: Crime, Haryana

ఉత్తమ కథలు