తల్లికొడుకుల పన్నాగం.. మైనర్ బాలిక కిడ్నాప్

కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తుంటే సరిచేయాల్సిన తల్లి.. అతనికి మద్దతుగా నిలిచింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేయడానికి సహకరించింది.

news18-telugu
Updated: September 27, 2020, 3:21 PM IST
తల్లికొడుకుల పన్నాగం.. మైనర్ బాలిక కిడ్నాప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొడుకు తప్పుడు మార్గంలో వెళ్తుంటే సరిచేయాల్సిన తల్లి.. అతనికి మద్దతుగా నిలిచింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేయడానికి సహకరించింది. ఈ ఘటన పంజాబ్ లుథియానా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో తల్లీ కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి బంధువుల్లో ఒకరి ఇంట్లో నుంచి బాలికను రక్షించారు. వివరాలు.. 47 ఏళ్ల మనీషాకు 19 ఏళ్ల అభిషేక్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు అదే గ్రామానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై వేధించడమే పనిగా పెట్టకున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలికను మనీషా తన కొడుకు అభిషేక్, మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసింది. సెప్టెంబర్ 23న బాలిక ఇంట్లోకి చోరబడిన మనీషా.. పదునైన ఆయుధాలతో అక్కడ అందరిని కలవరానికి గురిచేసింది. బాలిక తల్లిదండ్రులను తోసేసి ఆమెను బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.

అభిషేక్ తరుచూ తమ కూతురికి వేధించేవాడని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం స్థానికంగా అందరికి తెలుసని చెప్పారు. ఈ విషయంలో పలువురు కలుగుచేసుకుని వేధింపులు ఆపాలని అభిషేక్‌ను హెచ్చరించారని.. అయినప్పటికీ అతడు మారలేదని తెలిపారు. ఇక, బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అభిషేక్ బంధువులలో ఒకరి ఇంట్లో మైనర్ బాలికను దాచి ఉంచినట్టు గుర్తించారు. అక్కడ నుంచి గురువారం రాత్రి బాలికను రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

మరోవైపు శుక్రవారం మనీషాను ఆమె కొడుకు అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో తల్లి కొడుకులకు సహకరించిన మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్టు చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: September 27, 2020, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading