news18-telugu
Updated: November 13, 2020, 8:53 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. ఉద్యోగం ఇస్తామని ఓ మహిళను రామ్మని చెప్పిన దుర్మార్గులు ఆమెతో పాటు, ఆ మహిళ నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులిద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ దేశంలోని కశ్మోర్ లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే కొందరు దుర్మార్గులు ఓ మహిళకు రూ. 40 వేల జీతం ఉండే ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పారు. ఇందు కోసం ఓ ప్రదేశానికి రావాలని సూచించారు. దీంతో ఆ మహిళ ఉద్యోగం కోసం వారు చెప్పిన చోటుకు వెళ్లింది. దీంతో ఆ దుర్మార్గులు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
అంతటితో ఆగకుండా ఆ మహిళ నాలుగేళ్ల కూతురిపై సైతం అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ, ఆ చిన్నారి ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వావివరుసలు మరిచిన కొందరు కామాందులు చెల్లి, కూతుళ్లపై సైతం దారుణాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా గుజరాత్ లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి తన 11 ఏళ్ల కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్య ఊరికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
Published by:
Nikhil Kumar S
First published:
November 13, 2020, 8:48 PM IST