హోమ్ /వార్తలు /క్రైమ్ /

Very Sad: ఇంతకంటే పాపం మరొకటి ఉండదు.. ఈ ఆధార్ కార్డులో కనిపిస్తున్న ఆరేళ్ల పిల్లాడి జీవితం..

Very Sad: ఇంతకంటే పాపం మరొకటి ఉండదు.. ఈ ఆధార్ కార్డులో కనిపిస్తున్న ఆరేళ్ల పిల్లాడి జీవితం..

అవిజోత్ సింగ్

అవిజోత్ సింగ్

కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడంలో తల్లికి మరెవరూ సాటిరారు. ఆ పేగు బంధం అలాంటిది. తను కడుపు మాడ్చుకుని అయినా బిడ్డల కడుపు నింపే తల్లులున్న ఈ సమాజంలోనే కట్టుకున్న భర్తతో గొడవల మూలంగా క్షణికావేశంలో బిడ్డలు ప్రాణాలు తీస్తున్న తల్లులూ ఉండటం శోచనీయం.

ఇంకా చదవండి ...

కపుర్తాలా: కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడంలో తల్లికి మరెవరూ సాటిరారు. ఆ పేగు బంధం అలాంటిది. తను కడుపు మాడ్చుకుని అయినా బిడ్డల కడుపు నింపే తల్లులున్న ఈ సమాజంలోనే కట్టుకున్న భర్తతో గొడవల మూలంగా క్షణికావేశంలో బిడ్డలు ప్రాణాలు తీస్తున్న తల్లులూ ఉండటం శోచనీయం. పంజాబ్‌లోని కపుర్తాలా పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆరేళ్ల వయసున్న కన్నకొడుకుకు విషం పెట్టి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కపుర్తాలా పరిధిలోని హశువల్ గ్రామానికి చెందిన హర్జీత్ సింగ్, సారాబ్జిత్ కౌర్‌‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. వీరిలో పెద్ద పిల్లాడి పేరు అవిజోత్ సింగ్. అవిజోత్ వయసు ఆరేళ్లు. అవిజోత్ పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటూ చలాకీగా ఉండేవాడు. ఇదిలా ఉంటే.. కొన్ని నెలల నుంచి కొత్తగా కట్టుకుంటున్న ఇంటి విషయంలో హర్జిత్ సింగ్‌కు, తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా హర్జిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే.. భర్త పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో అవిజోత్‌తో కలిసి ఉన్న హర్జిత్ భార్య పిల్లాడితో బలవంతంగా విషం కలిపి తినిపించింది. కొంతసేపటికి హర్జిత్ ఇంటికొచ్చే సరికి అవిజోత్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

పిల్లాడిని ఆ స్థితిలో చూసి షాకైన హర్జిత్ ఏం చేయాలో తెలియక ఊరి సర్పంచ్ ఇంటికెళ్లి విషయం చెప్పి కొడుకును కారులో చికిత్స నిమిత్తం జలంధర్‌కు తరలించగా.. మార్గం మధ్యలోనే పిల్లాడు చనిపోయాడు. పిల్లాడి మృతితో కన్నీరుమున్నీరయిన హర్జిత్ అసలు ఏం జరిగిందో.. పిల్లాడు ఏం తిన్నాడో ఆరా తీయగా.. తన భార్యే పిల్లాడి మృతికి కారణమని తెలిసింది. ఈ ఘటన గురించి కపుర్తాలా పోలీసులు సమాచారం అందుకుని స్పాట్‌కు చేరుకున్నారు. విషం కలిపి పిల్లాడికి తినిపించినట్లు నిర్ధారణకొచ్చారు.

ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంట్లో ఉన్న ఈమెను చావు ఎంత దారుణంగా పలకరించిందో చూడండి..

హర్జిత్ సింగ్ భార్య సారాబ్జిత్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో కన్నతల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసి గ్రామస్తులు షాకయ్యారు. అవిజోత్ ఏం పాపం చేశాడని కన్న తల్లి పొట్టనపెట్టుకుందని మాట్లాడుకున్నారు. పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. పిల్లాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే బిడ్డ ప్రాణాలు తీయడం శోచనీయం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన రుజువు చేసింది.

First published:

Tags: Crime news, Mother killed her baby, Murder, Punjab news, Wife and husband