డాక్టర్ల నిర్లక్ష్యం.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి

కనీసం తన పిల్లల ముఖం చూడకుండానే ఆమె మరణించింది. మోనికాకు ఇంత ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమె మరణంతో ముగ్గురూ తల్లి లేని పిల్లలయ్యారు.

news18-telugu
Updated: September 16, 2019, 6:39 PM IST
డాక్టర్ల నిర్లక్ష్యం.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి
మాతృప్రియ హాస్పిటల్
  • Share this:
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి కాసేపటికే కన్నుమూసింది. తన బిడ్డలను కళ్లారా చూడకుండానే.. చేతులో స్పృశించకుండానే.. మరణించింది. కవల పిల్లలను లోకానికి పరిచయం చేసి.. తాను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఉప్పల్‌లోని మాతృపియ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధవులు ఆరోపిస్తున్నారు. శవంతో ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు.

మోనికాకు తొమ్మిది నెలలు నిండడంతో ఇటీవల మాతృప్రియ హాస్పిటల్‌లకు తీసుకొచ్చారు. ఆమెకు సాధారణ ప్రసవం అయ్యే ఛాన్స్ లేదని.. సిజేరియన్ చేయాలని చెప్పడంతో అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆదివారం డాక్టర్లు రాత్ర్రి ఆపరేషన్ చేసి ఇద్దరు పిల్లలకు పురుడు పోశారు. ఐతే ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం జరగడంతో కాసేపటికే మోనికా చనిపోయింది. కనీసం తన పిల్లల ముఖం చూడకుండానే ఆమె మరణించింది. మోనికాకు ఇంత ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమె మరణంతో ముగ్గురూ తల్లి లేని పిల్లలయ్యారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading