Home /News /crime /

MOTHER DAUGHTER POSE AS SHIPYARD OWNERS CHEAT BIG SHOTS WITH HUGE AMOUNT IN MUMBAI MS

నౌకలు ఇప్పిస్తామని నట్టేట ముంచిన తల్లీ కూతుళ్లు.. రూ. 14 కోట్లకు పంగనామం పెట్టిన కిలాడీ లేడీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమకు ఒక షిప్ యార్డ్ ఉన్నదని... బడా వ్యాపారస్తులకు టగ్ బోట్లు, నౌకలు ఇప్పిస్తామని చెప్పి వారిని నిండా ముంచారు ఆ కిలాడీ లేడీలు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 14 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టారు.

  • News18
  • Last Updated :
    తాము షిప్ యార్డ్ ఓనర్లమని.. నౌకలు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని నట్టేట ముంచారు తల్లీ కూతుళ్లు. తమకు ఒక షిప్ యార్డ్ ఉన్నదని... బడా వ్యాపారస్తులకు టగ్ బోట్లు, నౌకలు ఇప్పిస్తామని చెప్పి వారిని నిండా ముంచారు ఆ కిలాడీ లేడీలు. తమ వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులున్నారని.. వారి అండ తమకు ఉన్నంత కాలం ఎవరూ తమను ఏమీ చేయలేరని మాయ మాటలు చెప్పి.. వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 14 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టారు.

    మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన రాగిని ఖండేల్వాల్, ఆమె కూతురు మాన్సీ నగరంలో బడా వ్యాపారస్తులను టార్గెట్ గా చేసుకున్నారు. వీరు గతేడాది ముంబయికి చెందిన వ్యాపారి.. సుశాంత్ శెలట్కర్ ను కలిశారు. తమకు మహారాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉన్న నాయకులతో సంబంధాలున్నాయని ఆయనను నమ్మించారు. అంతేగాక తమకు ఒక షిప్ యార్డ్ (శ్రీ తిరుపతి బాలాజీ కంపెనీ) కూడా ఉన్నదని.. ఆ సంస్థకు తామే డైరెక్టర్లమని నమ్మబలికారు. సుశాంత్ కు టగ్ బోట్లు, నౌకలను తయారుచేసి ఇస్తామని.. ఆయన దగ్గర రూ. 1.3 కోట్ల రూపాయలను తీసుకున్నారు. గతేడాది జూన్ లో సుశాంత్.. ఆ తల్లీకూతుళ్లకు డబ్బులు అందజేశాడు.

    అయితే ఎన్ని రోజులైనా బోట్లు రాకపోవడంతో సుశాంత్ కు అనుమానం వచ్చింది. దీంతో విసిగెత్తిపోయిన సుశాంత్.. తనకు డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. అదే సమయంలో అతడికి ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనకు తెలిసిన ఒక వ్యక్తి అదే తల్లీకూతుళ్లతో నౌకా వ్యాపారం చేస్తున్నాడని ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో సుశాంత్ పోలీసులను ఆశ్రయించాడు.

    కేసు పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు వారితో అసలు విషయాలు చెప్పించారు. తమకు షిప్ యార్డ్ లు ఏమీ లేవని వాళ్లు ఒప్పుకున్నారు. ముంబయిలోని కళ్యాణ్ ప్రాంతంలో తమకు షిప్ యార్డ్ ఉందని చెబుతూ.. వీళ్లు వ్యాపారస్తులను మోసం చేస్తున్నారు. సుశాంత్ తో పాటు మరి కొంతమందికి ఇలానే మాయమాటలు చెబుతూ సుమారు రూ. 14 కోట్ల దాకా వెనకేశారని పోలీసుల విచారణ లో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Maharashtra, Mumbai, Mumbai crime

    తదుపరి వార్తలు