HOME »NEWS »CRIME »mother commits suicide along with two children ba mbnr

తెలంగాణలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య

తెలంగాణలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది

  • Share this:
    కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్ప, ఎల్లమ్మ(26) భార్యాభర్తలు. వీరికి రజిత(8) అనిత, రాజు(4) అనే ముగ్గురు సంతానం. ఈరోజు ఉదయం కుటుంబ పరిస్థితుల విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో కలత చెందిన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలు రాజు, రజిత, అనితతో కలిసి కొడంగల్ మండలం హస్నాపూర్ చెరువు వద్దకు చేరుకుని పిల్లలందరికీ చున్నీతో చేతులు కట్టేసి తను కూడా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో అనిత అనే అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కానీ ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో పడి చనిపోయారు. హృదయ విదారకమైన ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల వారిని తీవ్రంగా కలచివేసింది. ముక్కుపచ్చలారని చిన్నారి అనిత ఘటన జరిగిన వివరాలను తెలుపుతూ ఉంటే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తుల అంతా కలసి చెరువులో మృతదేహాలను వెలికితీశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:November 26, 2020, 22:55 IST

    टॉप स्टोरीज