హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana Crime News: క్షణికావేశంతో ముగ్గురు ప్రాణాలు బలి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కూడా.. ఏం జరిగిందంటే..

Telangana Crime News: క్షణికావేశంతో ముగ్గురు ప్రాణాలు బలి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కూడా.. ఏం జరిగిందంటే..

అయితే రిపేరుకు సమయం పడుతుందని 

చెబుతున్నా వినకుండా ఎటాక్ చేశారని బాధితుడు స్థానిక హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కాగా 

దాడిలో గాయపడిన ఆసీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు 

చేసి నిందుతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)

అయితే రిపేరుకు సమయం పడుతుందని చెబుతున్నా వినకుండా ఎటాక్ చేశారని బాధితుడు స్థానిక హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కాగా దాడిలో గాయపడిన ఆసీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి నిందుతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను చిదిమేసి ఆపై తనూ బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగేళ్ల క్రితం వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 9 నెలల బాబు, మూడేళ్ల కూతరు ఉన్నారు. భర్త ఆర్ ఎంపీ గా విధులు నిర్వహిస్తున్నాడు. దంపతుల మధ్య ఏదో ఒక సమస్యపై రోజూ గొడవలు పడుతూ ఉండేవారు. ఓ రోజు భర్త సమీప బంధువు ఊరికి వెళ్తానని చెప్పగా భార్య వద్దని వారించింది. అయినా భర్త వినకుండా వెళ్తానని మొండికేశాడు. అక్కడు వెళ్తే తాను ఆత్మహత్య చేసకుంటానని బెదిరించింది. అయినా అతడు వినకుండా పక్క గ్రామానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇద్దరు పిల్లలతో సహా ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నకేశవాపురం గ్రామానికి చెందిన చింతలపాటి రాములు, పద్మల చిన్న కూతురు మౌనిక (28)కు చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు నడిగూడెం మండలం రామాపురంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దంపతులకు మూడేళ్ల చిన్నారి లాక్షిత (3), తొమ్మిది నెలల బాలుడు సంతానం.

కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, శ్రీనాథ్‌ ఆదివారం సమీప బంధువు ఊరైన రత్నవరం వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. దీంతో మౌనిక అక్కడికి వెళ్లొద్దని భర్తను వారించింది. ఒకవేళ వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంలో దంపతుల మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత వినకుండా శ్రీనాథ్‌ రత్నవరం గ్రామానికి బయలుదేరాడు. భర్త తన మాట వినకుండా రత్నవరం గ్రామానికి వెళ్లడంతో మౌనిక విచక్షణ కోల్పోయింది. క్షణికావేశంలో తన ఇద్దరు చిన్నారులను తలుపు బేడానికి ఉరివేసింది.

వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ గది మధ్యలో ఉన్న ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనాథ్‌ ఎంత పిలిచినా భార్య తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులను తొలగించి చూడగా మౌనిక, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తుల సమాచారంతో ఎస్‌ఐ ఎం.ఏడుకొండలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Crime, Crime news, Family suicide, Suryapeta, Telangana crime news

ఉత్తమ కథలు