Home /News /crime /

MOTHER CHILD DEATH DURING CHILDBIRTH AND HER PARENTS TEARS AS DOCTORS DELAYED TREATMENT SSR

Sad: ఈమె పరిస్థితి ఎవరికీ రాకూడదు.. మనింటి ఆడబిడ్డకే కాదు ఏ మహిళకు ఇలా జరిగినా తట్టుకోలేం..

శ్వేత (ఫైల్ ఫొటో)

శ్వేత (ఫైల్ ఫొటో)

ఆమె ‘అమ్మ’ అనే పిలుపు కోసం ఆరాటపడింది. బిడ్డను నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ.. ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. బిడ్డ కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకుండానే తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయారు.

  చిక్‌మగళూరు: ఆమె ‘అమ్మ’ అనే పిలుపు కోసం ఆరాటపడింది. బిడ్డను నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ.. ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. బిడ్డ కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకుండానే తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్‌మగళూరులో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్‌మగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పూర్ తాలూకా బన్నహూనూరు ప్రాంతానికి చెందిన శ్వేతకు గతేడాది వివాహమైంది. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చింది. తల్లి కాబోతున్న విషయం తెలిసి ఆమె భర్త, శ్వేత ఎంతో సంతోషించారు. ప్రసవానికి శ్వేత పుట్టింటికి వెళ్లింది. గర్భిణిగా ఉన్న కూతురి ఆలనాపాలనా తల్లిదండ్రులు చూసుకున్నారు. శ్వేతకు కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

  అయితే.. ఆ సమయంలో హాస్పిటల్‌లో డాక్టర్ లేడు. నర్సులు డాక్టర్‌కు ఫోన్ చేసి ఎమర్జెన్సీ కేసు వచ్చిందని, రావాలని కోరారు. కొంతసేపటికి డాక్టర్ వచ్చాడు. అప్పటికే శ్వేతకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో భరించలేక తల్లడిల్లిపోతోంది. డాక్టర్ వచ్చాక కూడా ఆమెకు వైద్యం చేయలేదు. ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలంటే డబ్బు కట్టాలని శ్వేత తల్లిదండ్రులకు డాక్టర్ తెగేసి చెప్పాడు.

  ఇది కూడా చదవండి: OMG: మొబైల్ ఛార్జర్‌తో ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా.. ఇంతకన్నా పాపం మరొకటి ఉండదు..

  వెంట తెచ్చుకున్న కొంత డబ్బును డాక్టర్‌కు ఇచ్చారు. అయినా ఆ డాక్టర్ ధన దాహం తీరలేదు. పురిటి నొప్పులు పడుతున్న మహిళను ఒకపక్క ఉంచుకుని ఆమె తల్లిదండ్రులతో మరింత డబ్బు కావాలని కోరాడు. మీరు వైద్యం చేసి తల్లీబిడ్డను కాపాడాలని, తాము డబ్బు సర్దుతామని చెప్పినా ఆ డబ్బు పిచ్చి డాక్టర్ వినిపించుకోలేదు. ఫలితంగా.. తల్లీబిడ్డా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన కూతురు విగత జీవిగా కనిపించేసరికి శ్వేత తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. డాక్టర్ నిర్లక్ష్యమే తల్లీబిడ్డ ప్రాణం తీసిందని కన్నీరుమున్నీరయ్యారు.

  ఇది కూడా చదవండి: Lovers: ఇలాంటి వాడని తెలియక ప్రేమించి తప్పు చేశావ్.. కానీ తెలిశాక కూడా నువ్విలా చేయడం ఏంటమ్మా..

  ఒక మనిషి అలాంటి స్థితిలో ఉంటే కాపాడాల్సిన డాక్టర్ ఇలా బేరసారాలు ఆడటమేంటని శ్వేత బంధువులు మండిపడ్డారు. నర్సులపై, డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశం కావడంతో వ్యవహారం డీహెచ్‌వో వరకూ వెళ్లింది. సదరు డాక్టర్‌పై చర్యలు తీసుకునేంత వరకూ వెనక్కి తగ్గేది లేదని శ్వేత బంధువులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఈ డాక్టర్ ఎల్దోస్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు విచారణలో తేలింది. డీహెచ్‌వో హామీ ఇవ్వడంతో శ్వేత తల్లిదండ్రులు, బంధువులు ధర్నాను విరమించారు. వైద్యో నారాయణో హరి అని వైద్యుడిని దేవుడిగా భావించే మన దేశంలో డబ్బు పిచ్చి ముదిరిన ఇలాంటి కొంతమంది వైద్యులు వైద్య వృత్తికే తలవొంపులు తెస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావించిన శ్వేత జీవితం ఇలా నిర్లక్ష్యపు నీలి నీడల్లో చిక్కుకుని అర్థాంతరంగా ముగిసిపోయింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangalore, Crime news, Karnataka, Pregnant

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు