Twins fall: ఫేస్​బుక్​ లైవ్​లో మునిగిన తల్లి.. 10వ అంతస్తు నుంచి కిందపడిన రెండేళ్ల కవల పిల్లలు

పిల్లలతో ఆండ్రియా

ఆమె కవల పిల్లలు (twins) ఆడుకుంటూ 10 వ అంతస్తు నుంచి కింద పడ్డారు. అయినా ఆండ్రియా లైవ్ (live) లో బిజీగా ఉండిపోయింది. పిల్లల గురించి పట్టించుకోలేదు. వాళ్లు పడిపోయారని కూడా ఆమె గ్రహించలేదు. పిల్లల అరుపులు కూడా తను వినలేదు. ఆ సమయంలో అంబులెన్సు వచ్చినా ఏదో అనుకుని, మొత్తం ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో మునిగిపోయింది.

 • Share this:
  సోషల్ మీడియా (Social media). దూరం ఉన్నవాళ్లను దగ్గరికి చేరుస్తుంది. దగ్గరగా ఉన్నవాళ్లనూ దూరం చేస్తుంది. ఫేస్​బుక్​, ట్విటర్​, వాట్సాప్​ ఏదైనా బయటికొచ్చిన ఉద్ధేశం మంచిదైనా.. రోజులు గడుస్తున్నా కొద్దీ వాటిని వాడే వినియోగదారుల ఉద్ధేశాలు మారిపోతున్నాయి. చాలామంది ఫేమస్​ అవడానికి, సెలెబ్రెటీ స్టేటస్​ తెచ్చుకోవడానికే వినియోగిస్తున్నారు. అయితే ఆ వ్యామోహంలో పడిపోయే సొంత కుటుంబాలను కూడా పట్టించుకోని స్థితిలోకి వెళ్లిపోయారు జనం. ఇటీవల అలాంటి ఘటనే రొమేనియాలో జరిగింది. ఫేస్‌బుక్‌ (face book) వ్యామోహంలో మునిగిన తల్లి వల్ల ఇద్దరు చిన్నారుల (Children) ప్రాణాలు అర్దాంతరంగా గాల్లో కలిశాయి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె అదే పిచ్చిలో ఉండటం గమనార్హం. తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరని తెలుసుకొని అప్పుడు విలపించింది. తను చేసిన తప్పెంటో తెలుసుకొని కన్నీరు కార్చింది. కానీ ఏం లాభం.. అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది.  చినిపోయిన ఆ ఇద్దరు పిల్లలు కవలలు (Twins) కూడా కావడం విషాదంతం. వారికి రెండేళ్లు. రొమేనియా (Romania)లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది.

  స్నేహితురాలికి అప్పజెప్పి..

  రొమేనియా (Romania)లోని ప్లోయిస్టి నగరంలో ఉంటున్న ఆండ్రియా (Andreea)కు ముగ్గురు పిల్లలు. రెండో, మూడో పిల్లలు కవలలు(2). వారిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పేర్లు మోయిస్ క్రిస్టియన్ పెట్రిస్, బీట్రైస్-ఎరికా పెట్రిస్. అయితే ఆండ్రియాకు ఓ స్నేహితురాలు ఉంది. పేరు అలీనా (Alina). అప్పుడప్పుడు ఆండ్రియా ((Andreea) పిల్లలను ఆమె చూసుకుంటుంది. అయితే ఒకరోజు తన పిల్లను చూసుకోమని ఆండ్రియా అలీనా (Alina)కు చెప్పింది. ఆండ్రియా తన ఇంట్లో ఫేస్‌బుక్‌ లైవ్ (face book Live) స్ట్రీమింగ్‌లో బిజీగా ఉంది.

  అంబులెన్సు చూసినా..

  ఈ సమయంలో ఆమె కవల పిల్లలు (twins) ఆడుకుంటూ 10 వ అంతస్తు నుంచి కింద పడ్డారు. అయినా ఆండ్రియా లైవ్ (live) లో బిజీగా ఉండిపోయింది. పిల్లల గురించి పట్టించుకోలేదు. వాళ్లు పడిపోయారని కూడా ఆమె గ్రహించలేదు. పిల్లల అరుపులు కూడా తను వినలేదు. ఆ సమయంలో అంబులెన్సు వచ్చినా ఏదో అనుకుని, మొత్తం ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో మునిగిపోయింది.

  పోలీసులు చెప్పే వరకు..

  ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెళ్లి చెప్పే వరకు కూడా ఆండ్రియా ఫేస్‌బుక్‌ (face book)లో ప్రత్యక్షంగా చాట్ చేస్తోంది. తర్వాత పిల్లలు కిందపడిన విషయం తెలుసుకున్న ఆమె తనకు ఏమి తెలియదని, తాను అమాయకురాలినని బోరుమంది. ఆ సమయంలో తాను పెద్ద కుమారుడి (Elder son)తో వేరే గదిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. పెద్ద కుమారుడికి కవలలు అంటే కోపమని రూంలో వేరే ఉంచానని పేర్కొంది.

  ఇది కూడా చదవండి:  సార్​... నా కోడిని ఎవరో చంపేశారు.. వెంటనే పోస్టుమార్టం చేసి నిందితులను పట్టుకోండి

  కానీ పిల్లలు కిటికీ ఎక్కలేరని ఆమె చెప్పింది. ఆలియానే ఏదో చేసిందని ఆరోపణలు చేసింది. కవలల్లో ఒక కుమార్తె బీట్రైస్-ఎరికా పెట్రిస్ ఎక్కువ నడవలేదని, కనీసం టేబుల్ కూడా ఎక్కలేదని (she would not have been able to climb on the table or on the bed on her own) తెలిపింది. అలాంటిది బాల్కనీ నుంచి ఎలా పడిపోతుందని బోరుమంది. ఆండ్రియా స్నేహితురాలు ఆలియా (Alia) మాత్రం ఆమెపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంటుంది. తను పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్నానని చెబుతోంది. ఆండ్రియా (Andreea) పిల్లలను ఎక్కువ పట్టించుకునేది కాదని ఆరోపణలు గుప్పించింది. అయితే తనపై వచ్చిన డ్రగ్స్​ ఆరోపణలను సైతం ఖండించింది. ఎలాంటి డ్రగ్స్ (Drugs)​ తీసుకోలేదని తెలిపింది. కాగా, గత నెలలోనే వాళ్లిద్దరికి రెండో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇంతలోనే విషాదం నెలకొంది.
  Published by:Prabhakar Vaddi
  First published: