యువతిని వ్యభిచారంలోకి నెట్టిన తల్లి.. సోదరుడే ఆమెపై..

Crime News: సోదరుడే కామాంధుడై ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు.. కట్టుకున్న భర్త మరొకరితో పడకపైకి వెళ్లాలని దారుణంగా హింసించి చిత్రవధ చేశాడు.

news18-telugu
Updated: August 19, 2019, 11:22 AM IST
యువతిని వ్యభిచారంలోకి నెట్టిన తల్లి.. సోదరుడే ఆమెపై..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లే కూతుర్ని వ్యభిచార కూపంలోకి నెట్టింది.. సోదరిపై ఈగ వాలకుండా జాగ్రత్త పడాల్సిన సోదరుడే కామాంధుడై ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు.. కట్టుకున్న భర్త మరొకరితో పడకపైకి వెళ్లాలని దారుణంగా హింసించి చిత్రవధ చేశాడు.. ఓ టీనేజీ అమ్మాయికి నరకం చూపించి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ దారుణ ఘటన తూర్పు ముంబైలోని మన్‌ఖుర్ద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తల్లి, సోదరుడు, భర్తతో మరో ఇద్దరు కలిసి యువతిని వ్యభిచారం చేయాలని చిత్రవధ చేశారు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలు మైనర్‌ అని కూడా చూడకుండా ఓ వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసింది ఆమె తల్లి. సెక్స్ కోసం ఆమె భర్త దారుణంగా హింసించేవాడు. ఆ బాధను తట్టుకోలేక పుట్టింటికి వచ్చింది. కానీ.. తల్లే ఆమెను వ్యభిచార గృహానికి తీసుకెళ్లి 60 ఏళ్ల వ్యక్తితో వ్యభిచారం చేయాలని చెప్పింది.

వీరి నుంచి కాపాడాలని సోదరుడి వద్దకు వెళితే.. ఆ దుర్మార్గుడు వావివరుసలు మరచి.. సోదరిపైనే అత్యాచారం చేశాడు. తనకు ఎదురు చెబితే కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని బాధితురాలు ఆదివారంనాడు పోలీసుల చెంతకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 19, 2019, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading