టీవీ చూస్తోందని బెల్ట్‌తో కొట్టి ఎండలో నిలబెట్టిన తల్లి...ఐదేళ్ల చిన్నారి మృతి

ఒళ్లంతా వాతలు పడేలా చావబాదింది. అంతటితో కోపం తగ్గక... మండుతున్న ఎండలో నిలబెట్టింది. ఆ దెబ్బలు, ఎండ వేడిమి తట్టుకోలేక లతిక కుప్పకూలింది.

news18-telugu
Updated: May 21, 2019, 10:09 PM IST
టీవీ చూస్తోందని బెల్ట్‌తో కొట్టి ఎండలో నిలబెట్టిన తల్లి...ఐదేళ్ల చిన్నారి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్న పిల్లలన్నాక అల్లరి చేస్తారు. అన్న తినికుండా మారాం చేస్తారు. టీవీకి అతుక్కుపోతారు. ఆటలు తప్ప వేరే ధ్యాసే వారికి ఉండదు. ప్రతి ఇంటిలోనూ ఇది ఉండేదే..! చిన్నారుల తీరును కొందరు తల్లిదండ్రులు లైట్‌గా తీసుకుంటే.. మరికొందరు మాత్రం వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు. పసివాళ్లని కూడా చూడకుండా చితకబాదతారు. ఆ క్రమంలో ఒక్కోసారి పిల్లల ప్రాణాలు కూడా పోతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘోరమే జరిగింది. టీవీ చూస్తోందనే కోపంతో ఐదేళ్ల చిన్నారిని బెల్ట్‌తో చితక్కొట్టి ఆపై ఎండలో నిలబెట్టింది తల్లి. ఆ దెబ్బలకు, ఎండ వేడిమి తాళలేక ఆ బాలిక కన్నుమూసింది.

నిత్య కమలం(35)-పాండ్యన్ (37) దంపతుల తిరుచ్చిలో నివసిస్తున్నారు. వారికి ఐదేళ్ల కూతురు లతికా శ్రీ. అందరు పిల్లల్లాగే లతికాకు కూడా టీవీ చూడడం ఇష్టం. ఐతే ఎక్కువ సేపు టీవీ చూడొద్దని తల్లి ఎన్నోసార్లు వారించింది. ఐనా ఆ చిన్నారి పట్టించుకోలేదు. సోమవారం కూడా టీవీకి అతుక్కుపోయింది లతిక. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిత్య కమలం కూతురిని చితక్కొట్టింది. ఎన్ని సార్లు చెప్పినా మారవా..అంటూ విరుచుకుపడింది.

బెల్ట్‌తో లతికను ఎడాపెడా వాయించింది. ఒళ్లంతా వాతలు పడేలా చావబాదింది. అంతటితో కోపం తగ్గక... మండుతున్న ఎండలో నిలబెట్టింది. ఆ దెబ్బలు, ఎండ వేడిమి తట్టుకోలేక లతిక కుప్పకూలింది. భయపడిపోయిన తండ్రి హుటాుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం సేలం ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూనే లతిక చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 21, 2019, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading