ప్రకాశం జిల్లాలో దారుణం... బిడ్డతో సహా తల్లిని తగలబెట్టిన దుండగులు

రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు.

news18-telugu
Updated: December 4, 2019, 11:01 AM IST
ప్రకాశం జిల్లాలో దారుణం... బిడ్డతో సహా తల్లిని తగలబెట్టిన దుండగులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తల్లీబిడ్డను చంపేసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లీబిడ్డను అతికిరాతకంగా చంపేసి తగులబెట్టిన దారుణ ఘటన ఏపీలో జరిగింది. రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.  సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు. రెండేళ్ల చిన్నారి సహా మహిళను అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని సైతం నిర్దయగా కాల్చివేయడం చూపరులను తీవ్రంగా కలసివేసింది.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. దారుణంగా హత్య చేసిన అనంతరం మృతులను తగులబెడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆధారాలు దొరక్కుండా తప్పించుకునేందుకే పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>