కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి.. మరొకరు..

కారు, ఐషర్ వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసుల క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: June 14, 2020, 2:30 PM IST
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి.. మరొకరు..
ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.
  • Share this:
కారును ఐషర్‌ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కార్తీక్ రెడ్డి(22), అతడి తల్లి లక్ష్మి(45), మరో వ్యక్తి సందీప్ రెడ్డి బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో బయలుదేరారు. అయితే చిత్తూరు రింగురోడ్డు సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు, ఐషర్ వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసుల క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీ కొడుకులు కార్తీక్ రెడ్డి, లక్ష్మీ చనిపోయారు. మరోవ్యక్తి సందీప్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్ప్రతికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: June 14, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading