హోటల్ బుకింగ్స్ రద్దు చేసినందుకు తల్లీకొడుకుల అరెస్టు

జపాన్ దేశంలోని పశ్చిమ కోట్యో ప్రాంతంలో నకిలీ హోటల్ బుకింగ్ రిజర్వేషన్లకు పాల్పడుతున్న తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. వారు రివార్డు పాయింట్ల కోసం ఈ నకిలీ బుకింగ్స్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: February 13, 2020, 9:08 AM IST
హోటల్ బుకింగ్స్ రద్దు చేసినందుకు తల్లీకొడుకుల అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హోటల్ బుకింగ్స్ రద్దు చేసినందుకు తల్లీకొడుకులను అరెస్టు చేసిన ఘటన జపాన్‌లోని క్యోటో పశ్చిమ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదేంటి.. హోటల్ బుకింగ్ రద్దు చేస్తే అరెస్టు చేస్తారా అని అనుకుంటున్నారా. అవును ఇది నిజమే. కాకపోతే ఆ తల్లీకొడుకులు వారు ఉండేందుకు ఆ హోటల్స్‌ను బుక్ చేసి రద్దు చేయలేదు. రివార్డు పాయింట్ల కోసం తరచూ హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేయడం.. రద్దు చేస్తుండడంతో పోలీసులు బుధవారం సదరు తల్లీకొడుకులను అరెస్టు చేశారు. క్యోటో పశ్చిమ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల తల్లి, 31 ఏళ్ల వయస్సున్న కొడుకు రివార్డు పాయింట్ల కోసం గత నవంబరులో మూడు హోటళ్లలో 3200 బుక్సింగ్ రద్దు చేశారు. ఈ నకిలీ బుకింగ్స్ వల్ల ఆయా హోటల్స్‌కు 864 డాలర్ల నష్టం వాటిల్లింది. జపాన్ అంతటా ఆన్‌లైన్‌లో 3250 నకిలీ బుక్సింగ్ జరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. ఫలితంగా ఆ హోటల్స్‌కు 1.04 మిలియన్ల యెన్ల నష్టం వాటిల్లింది. ఈ బుక్సింగ్ ద్వారా తల్లీకొడుకులిద్దరూ 2.5 మిలియన్ యెన్స్ పాయింట్లను సేకరించారని తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ బుకింగ్స్ పాల్పడుతున్న పలువురిపై నిఘా ఉంచనున్నారు.

First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు