హోమ్ /వార్తలు /క్రైమ్ /

వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ.. తల్లి, కొడుకుల ప్లాన్.. నగ్న వీడియోలు అంటూ..

వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ.. తల్లి, కొడుకుల ప్లాన్.. నగ్న వీడియోలు అంటూ..

ఓ వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ.. అతని తన ట్రాప్‌లో ఇరికించింది. ఇందుకు ఆమె కొడుకు కూడా సహకరించాడు.

ఓ వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ.. అతని తన ట్రాప్‌లో ఇరికించింది. ఇందుకు ఆమె కొడుకు కూడా సహకరించాడు.

ఓ వ్యాపారవేత్తను ఇంటికి పిలిచిన మహిళ.. అతని తన ట్రాప్‌లో ఇరికించింది. ఇందుకు ఆమె కొడుకు కూడా సహకరించాడు.

  నగ్న వీడియోలు ఉన్నాయని చెప్పి వ్యాపారవేత్తను బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ.. భారీగా డబ్బులు దండుకుంది. ఇందుకు ఆమె కుమారుడు కూడా సహకరించాడు. దీంతో పోలీసులు వారిద్దరని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాకటలోని హుస్పేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొప్పళ్‌లో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఓ వ్యాపారవేత్త హోస్పేటలోని ఎంజే నగరలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి కొద్దిరోజుల్లోనే ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే గీత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అయితే తక్కువ కాలంలోనే వారి పరిచయం బలపడింది. ఈ క్రమంలోనే అతనిని.. ఇంటికి ఆహ్వానించింది. గీత ఆహ్వానం మేరకు వ్యాపారవేత్త ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే అప్పటికే గీత వ్యాపారవేత్తను బురిడి కొట్టించేందుకు ప్లాన్ చేసుకుంది. అతనికి ఇచ్చే టీ లో ముందుగానే మత్తుమందు కలిపింది.

  దీంతో గీత ఇంటికి వెళ్లి టీ తాగిన వ్యాపారవేత్త మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన వ్యాపారవేత్త.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఆ వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన గీత.. అతని నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరింది. ఆ వీడియోలు కావాలంటే తనకు రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అతడు గీతా బ్యాంక్ అకౌంట్‌కు రూ. 15 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే మిగిలిన 15 లక్షల రూపాయలు కూడా వెంటనే చెల్లించాలని గీత.. ఆ వ్యాపారవేత్తను ఒత్తిడి చేయసాగింది.

  ఈ క్రమంలోనే వేధింపులు భరించలేని ఆ వ్యాపారవేత్త ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్ాయదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గీత ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ వారికి గంజాయి లభించింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గీతతో పాటు, ఆమెకు సహకరించిన కొడుకు విష్ణును కూడా అరెస్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.

  First published:

  Tags: Blackmail, Crime news, Karnataka

  ఉత్తమ కథలు