MOTHER AND HER SON LIVES LEADS TO THESE SAD ENDING INCIDENT HAPPEND IN KRISHNAGIRI DISTRICT SSR
Tearful Incident: తట్టుకోలేరు.. అస్సలు తట్టుకోలేరు.. మరీ ఇంత బాధనా.. అసలేం జరిగిందంటే..
ప్రేమ్ కుమార్, అతని తల్లి కస్తూరి
తల్లీబిడ్డ బంధం గురించి ఏ కవి ఎంత గొప్పగా వర్ణించినా ఆ పేగు బంధానికి ఉన్న విలువ వర్ణనాతీతం. బిడ్డకు దెబ్బ తగిలితే తల్లి కంటిలో నీళ్లు కనిపిస్తాయి. అంతటి పవిత్ర బంధం తల్లీబిడ్డది.
కృష్ణగిరి: తల్లీబిడ్డ బంధం గురించి ఏ కవి ఎంత గొప్పగా వర్ణించినా ఆ పేగు బంధానికి ఉన్న విలువ వర్ణనాతీతం. బిడ్డకు దెబ్బ తగిలితే తల్లి కంటిలో నీళ్లు కనిపిస్తాయి. అంతటి పవిత్ర బంధం తల్లీబిడ్డది. బంధాలు మసకబారుతున్న ఈరోజుల్లో కూడా కన్న కొడుకు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక తల్లి చనిపోయిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన భూపతి అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ క్లాత్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య కస్తూరి, ప్రేమ్‌కుమార్, పునీత్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చేతికి అందివచ్చిన ఇద్దరు కొడుకులు, భార్యతో సంతోషంగా గడుపుతున్న భూపతికి ఊహించని కష్టం ఎదురైంది. ఆ ఇంటి పెద్ద కొడుకైన ప్రేమ్‌కుమార్ (25) అనారోగ్యానికి గురయ్యాడు.
ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయగా అతని కిడ్నీ పాడయిందని వైద్యులు తెలిపారు. కిడ్నీ మార్చితే కానీ ప్రేమ్ కుమార్ బతికే అవకాశం లేదని వైద్యులు ఆ కుటుంబానికి తేల్చి చెప్పారు. దీంతో.. ప్రేమ్ కుమార్ కన్న తల్లి కస్తూరి కిడ్నీ ఇచ్చి కొడుకును బతికించుకునేందుకు ముందుకొచ్చింది. కానీ.. ఈలోపు ప్రేమ్ కుమార్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అతనికి కామెర్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు.
దీంతో.. జాండీస్‌తో బాధపడుతున్న అతనికి కిడ్నీ మార్పిడి చేయడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో విసిగిపోయిన బతుకు మీద ఆశలను కోల్పోయాడు. తాను ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నానని భావించి క్షణికావేశంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్ చిన్నప్పటి నుంచి అతనిపై ఎంతో ప్రేమ పెంచుకున్న అతని కన్నతల్లి ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి లోనైంది.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందింది. ప్రేమ్ కుమార్ లేడనే విషయాన్ని తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఇలా తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేరు. కొంతసేపటికి బయట నుంచి వచ్చిన కస్తూరి చిన్న కొడుకు పునీత్ అమ్మను, అన్నను ఆ స్థితిలో చూసి షాకయ్యాడు. హుటాహుటిన వాళ్లిద్దరినీ కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఇద్దరూ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిణామంతో భూపతి, అతని చిన్న కొడుకు ప్రేమ్ కుమార్, కస్తూరి మృతదేహాలపై పడి ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.