• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MOTHER AND HER LOVER MURDER 4 YEAR OLD INJURED DAUGHTER IN RAJASTHAN SU

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. పోలీసుల విచారణ షాకింగ్ నిజం.. మరీ ఇంతా నీచమా..?

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న వివాహిత.. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి అతడితో కలిసి వెళ్లిపోయింది.

  • Share this:
    ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్న వివాహిత.. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి అతడితో కలిసి వెళ్లిపోయింది. అయితే ప్రియుడితో కలిసి జీవిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురైన చిన్నారి విషయంలో ఆమె చాలా నీచంగా ప్రవర్తించింది. వైద్యం చేయించడానికి డబ్బులు లేక.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. తాజాగా జరిగిన పోలీసు విచారణలో అసలు విషయం వెలుగులోకి చూసింది. ఈ ఘటన రాజస్తాన్‌లో జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జైపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుమిత్ అహీర్, టీనా దంపతులకు 4 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే టీనా అనుకోకుండా ఫోన్ ద్వారా ప్రహ్లాద్‌(45)తో పరిచయమైంది.

    ఈ క్రమంలోనే వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో టీనా తన కుమార్తెతో కలిసి ప్రహ్లాద్‌తో వెళ్లిపోయింది. జైపూర్ రూర‌ల్ ప‌రిధిలోని ఉద‌వల గ్రామంలో ఉంటోంది. మరోవైపు అహిర్ తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

    ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆచూకీని గుర్తించారు. అయితే ఆమె కుమార్తె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులు చిన్నారి గురించి టీనాను ప్రశ్నించగా షాకింగ్ విషయం వెలుగుచూసింది. తొలుత చిన్నారి బంధువుల ఇంట్లో ఉన్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టగా.. ఆమె చెప్పినచోట చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు టీనాను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె చేసిన నేరాన్ని అంగీకరించింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 8న‌ చిన్నారి ఆడుకుంటుండ‌గా మెట్ల‌పై నుంచి ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డింది. జైపూర్ న‌గ‌రానికి తీసుకువెళ్లాల‌ని స్థానిక వైద్యుడు వారికి సూచించ‌గా..చికిత్స కోసం డ‌బ్బు ఖ‌ర్చుచేసేందుకు టీనా, ఆమె ప్రియుడు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే వారిద్దరు కలిసి బాలిక‌ను గొంతు నులిమి చంపి స‌మీప అట‌వీ ప్రాంతంలో ప‌డేశారు.ఈ కేసుకు సంబంధించి పోలీసులు టీనా, ఆమె ప్రియుడు ప్రహ్లాద్‌ను అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: