విజయవాడలో దారుణం... ప్రియుడితో కలిసి కూతురి ప్రాణం తీసిన తల్లి

Andhra Pradesh : వివాహేతర సంబంధాలు ఎప్పుడూ విషాదాంతాలే. తల్లి ఏర్పరచుకున్న వివాహేతర సంబంధంపై ఆ చిన్నారి ప్రశ్నించేసరికి... కన్న పేగును తెంచేసుకోవడానికి ఆ తల్లి వెనకాడలేదు. ప్రియుడి ద్వారా హత్య చేయించి... మానవత్వానికే మచ్చతెచ్చింది.

news18-telugu
Updated: November 12, 2019, 7:56 AM IST
విజయవాడలో దారుణం... ప్రియుడితో కలిసి కూతురి ప్రాణం తీసిన తల్లి
విజయవాడలో దారుణం... ప్రియుడితో కలిసి కూతురి ప్రాణం తీసిన తల్లి
  • Share this:
Vijayawada : విజయవాడ దగ్గర్లోని గొల్లపూడి గ్రామంలో జరిగిందీ ఘోరం. మూటకట్టి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి ఊళ్లో అందరూ ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరిగిందంటే... వెంకటరమణ, అనిల్‌ భార్యాభర్తలు. భర్తైన అనిల్‌ కూలి పనికి వెళ్లేవాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్‌గా పనిచేసేది. వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు. ఓ కూతురు. అబ్బాయిలను బంధువుల దగ్గర ఉంచి చదివిస్తున్నారు. కూతురు ద్వారక మాత్రం పేరెంట్స్ దగ్గరే ఉంటూ... రెండో తరగతి చదువుతోంది. పక్కింట్లో పెంటయ్య, అతని భార్య అద్దెకు ఉంటున్నారు. పెంటయ్య భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో... ఆదివారం నాడు... ద్వారక... టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. ఆ టైంలో పెంటయ్యతో తన తల్లి క్లోజ్‌గా ఉండటాన్ని చూసింది. "అమ్మా ఏంటిది? నాన్నతో చెబుతా" అంది. అంతే... తల్లికి ఎక్కడ లేని కంగారొచ్చేసింది. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అంటూ తల్లి... పెంటయ్య ఇంట్లోంచీ వెళ్లిపోయింది. చిన్నారి ద్వారక నోరు నొక్కేసిన పెంటయ్య... తలుపులు మూసేశాడు. పాశవికంగా చిన్నారిని చంపేశాడు. ఆ టైంలో ఇంటి బయట జనం ఉండటంతో... శవాన్ని మూటకట్టి... పరుపు మూలన దాచాడు.

ద్వారక తల్లి... తన ఇంటికి వెళ్లకుండా బయటకు వెళ్లి... సాయంత్రం వేళ ఇంటికొచ్చింది. వస్తూనే... ద్వారక ఏదీ అని అనిల్‌ని అడిగింది. ఏమో నాకేం తెలుసు... ఆడుకోవడానికి వెళ్లి ఉంటుంది అన్నాడు అనీల్. రాత్రైనా పాప రాలేదు. వెంటనే ఆ తల్లి... కూతురి కోసం వెతుకుతున్నట్లు డ్రామా ఆడింది. ఊళ్లో అందర్నీ అడుగుతుంటే... వాళ్లూ వెతికారు. చివరకు రాత్రివేళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో... పెంటయ్యకు పాప శవాన్ని బయటకు తీసుకెళ్లడం వీలు కాలేదు.

పోలీసులు ఇంటింటినీ వెతకడం మొదలుపెట్టారు. పెంటయ్య అతి తెలివి చూపిస్తూ... పోలీసులతోనే ఉంటూ... పోలీసులకు బాగా సహకరించాడు. అందువల్ల మొదట అతనిపై అనుమానం కలగలేదు. ఇంతలో పెంటయ్య భార్య సునీత... పుట్టింటి నుంచీ భర్త దగ్గరకు వచ్చింది. ఆమె కూడా రాత్రంతా చిన్నారి కోసం వెతికింది. సోమవారం తెల్లారింది. మధ్యాహ్నం వరకూ చిన్నారి కనిపించలేదు. ఐతే... సునీతకు... మధ్యాహ్నం టైమ్‌లో పరుపు పక్కన ఏదో మూట కనిపించింది. అదేంటి అని చూసిన ఆమె షాకైంది. వెంటనే ఊళ్లో అందరికీ చెప్పేసింది. అందరూ ఆ ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఎంటరై... అసలు విషయం తెలుసుకున్నారు. పెంటయ్యను అరెస్టు చేశారు. డెడ్‌బాడీని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపారు. బాలికను ముఖంపై గుద్ది... పీక పిసికి చంపినట్లు తెలిసింది. ఇంత దారుణానికి పాల్పడిన పెంటయ్యను ఉరి తియ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యలో తల్లి పాత్ర కూడా ఉందని ఆరోపణలు రావడంతో... ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 


Pics : వీరా ఫేమ్ అరిష్ఫాఖాన్ క్యూట్ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :
Loading...
పెట్రోలుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం...

బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న సిసింద్రీ... వైరల్ వీడియో...

39వ రోజుకు ఆర్టీసీ సమ్మె... నేడు హైకోర్టు ఏం చెబుతుంది?

ఆసక్తిగా మహారాష్ట్ర రాజకీయాలు... రాష్ట్రపతిపాలన తప్పదా?

Health Tips : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... ఇదీ చరిత్ర?

First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...