యువకుడిని తగలబెట్టి చంపిన తల్లీ, కూతురు.. పక్కా ప్లాన్ ప్రకారం చేశారా?

యువకుడిని తగలబెట్టి చంపిన తల్లీ, కూతురు!

Crime News: అనుకోకుండా జరిగే నేరాలు ఒకరకం. కావాలని చేసే నేరాలు మరో రకం. ఇది ఎలాంటి నేరం... పోలీసులు ఎందుకు ఆ తల్లీకూతురును తప్పుపడుతున్నారు?

 • Share this:
  ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోరం పోలీసులతోపాటూ స్థానికులనూ ఆశ్చర్యపరిచింది. జనరల్‌గా అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపిస్తుంటారు, మోసం చేస్తుంటారు, ఒక్కోసారి ఉన్మాదిలా మారి హత్య (Murder Crime) చేస్తారు. కానీ ఇక్కడ రివర్సులో జరిగింది. అమ్మాయి, ఆమె తల్లీ కలిసి... అ అమాయకుణ్ని చంపేశారన్నది (youth murdered) కేసు సారాంశం. అలా ఎందుకు జరిగింది... ఓ అమాయకుడు (innocent) ఎందుకు బలైపోయాడన్నది అందరూ ఈ కేసు గురించి తెలుసుకునేలా చేస్తోంది. ఆలస్యం లేకుండా మనం కూడా కేసులోకి ఎంటరవుదాం.

  పక్కా ప్లాన్:
  అది ఛత్తీస్‌గఢ్... రాయ్‌పూర్. అక్కడ ఓ యువతికి పెళ్లి సంబంధాలు (marriage proposals) రావట్లేదు. చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతుంటే... కూతురికి తల్లి ఓ సలహా ఇచ్చింది. అలా చెయ్యి పెళ్లైపోతుంది అని చెప్పింది. ఆ ప్లాన్ నచ్చడంతో... కూతురు సరే అంది. ఆ తర్వాత కొన్ని రోజులకు వేద ప్రకాష్ అనే కుర్రాణ్ని చూసిన యువతి... అతన్ని తగులుకుంటాను అని చెప్పింది. తల్లి సరే అంది. అలా అతనితో స్నేహం స్టార్ట్ చేసింది. వేద ప్రకాష్ సైలెంట్ పర్సన్. ఎవరి జోలికీ వెళ్లే రకం కాదు. అయినా సరే ఈ అమ్మాయి వెంటపడుతుంటే... సరే అని తను కూడా స్నేహం మొదలుపెట్టాడు.

  ఘటన జరిగిన రోజు:
  కొన్నాళ్లు స్నేహం నటించిన యువతి... ఓ రోజు తన ఇంటికి రమ్మంది. రానన్నాడు. ఇంటికి వచ్చేంత స్నేహం మన మధ్య లేదు అన్నాడు. అయినా సరే ఆమె ఒప్పుకోలేదు. రాకపోతే బాగోదు. ఇంటికేగా రమ్మంటున్నది అంటూ పిలిచింది. సర్లే అంతగా అడుగుతున్నప్పుడు వెళ్లకపోతే బాగోదని ఆగస్ట్ 18న వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే ఆమె తల్లి అతన్ని నవ్వుతూ పలకరిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లింది.

  లోపలికి వెళ్లాక తన కూతుర్ని పెళ్లి చేసుకోమని తల్లి బలవంతం (forced to get married) చేసింది. ఆశ్చర్యపోయిన వేద ప్రకాష్... తనకు ఆ ఉద్దేశం లేదన్నాడు. ఏ ఉద్దేశమూ లేనప్పుడు ఇంటి దాకా ఎందుకొచ్చావ్ అని ప్రశ్నించింది. ఆమె కంటిన్యూగా అడగడంతో వచ్చానని అన్నాను. అలా వచ్చావంటే... నీ ఉద్దేశం అదే అంటూ... పెళ్లి చేసుకుంటావా... నా కూతుర్ని రేప్ చేశావని కేసు పెట్టమంటావా అని బెదిరించింది. వేద ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. తల్లీ కూతురూ కలిసి తనను ఇలా ఇరికిస్తున్నారేంటని షాకయ్యాడు. అంతలోనే ఆమె పెట్రోల్ క్యాన్ తెచ్చింది.

  పెళ్లి చేసుకోకపోతే... చంపుతా అని బెదిరించింది. దాంతో వేద ప్రకాష్ పారిపోవాలని చూశాడు. కాని వాళ్లు వదల్లేదు. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు (doused him with petrol). కాలిన గాయాలతో ఇంట్లోంచి పరుగులు పెట్టాడు. అది చూసిన స్థానికులు... అతని మంటలు ఆర్పి... రాయ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వేద ప్రకాష్ కుటుంబ సభ్యులు... ఆస్పత్రికి వెళ్లి... డాక్టర్లను కలిశారు. ఆ తర్వాత ఆ తల్లీకూతురిపై వైకుంఠపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

  ఇది కూడా చదవండి: Video: పెళ్లిలో వధువుకి కోపం తెప్పించారు.. ఆమె ఏం చేసిందో తెలుసా?

  ఆ తల్లీ కూతురూ తనను డబ్బు కూడా డిమాండ్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు వేద ప్రకాష్. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో... కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి ఆగస్ట్ 26న చనిపోయాడు. పోలీసులు IPC సెక్షన్లు 302, 384 కింద కేసు రాసి... తల్వాపారాకి పారిపోయిన తల్లీ, కూతుర్ని వెతికి పట్టుకొని అరెస్టు చేశారు. తల్లి మాతా ప్రమీలా ప్రధాన్ వయసు 40 ఏళ్లు కాగా... కూతురు పూజ ప్రధాన్ వయసు 21 అని పోలీసులు తెలిపారు. ఇదే నేరం అబ్బాయి చేసి ఉంటే... అతన్ని ఉన్మాది అంటారు కదా... మరి వాళ్లను ఏమనాలి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: