పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని.. తల్లీకూతుళ్లు కలిసి లేపేశారు

గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా మనకు ఫోన్ చేస్తే ఏం చేస్తాం. ఇక ఫోన్ చేయకండని చెప్తాం.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ ఈ తల్లీకూతుళ్లు మాత్రం ఏకంగా ఆ ఫోన్ చేసి విసిగించిన వ్యక్తికి పైకి పంపించారు.

news18
Updated: October 22, 2020, 7:33 AM IST
పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని.. తల్లీకూతుళ్లు కలిసి లేపేశారు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 22, 2020, 7:33 AM IST
  • Share this:
మనకు ఎవరైనా పదే పదే ఫోన్ చేసి విసిగిస్తే ఏం చేస్తాం. వారికి మళ్లీ ఫోన్ చేయవద్దనో చెప్తాం. లేదంటే ఆ ఫోన్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతాం. అవతలి వాడు మరీ సాడిస్టు అయి ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేస్తే వాడిపై పోలీస్ కంప్లయింట్ ఇస్తాం. అవతలి వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ తల్లీకూతుళ్లు మాత్రం అలా చేయలేదు. వద్దని చెబుతున్నా మమ్మల్ని విసిగిస్తావా..? అంటూ ఏకంగా అతడిని పైకి పంపారు. ఈ ఘటన తమిళనాడులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీని వివరాలు కింది విధంగా ఉన్నాయి. తమిళనాడు లోని కోయంబత్తూరుకు చెందిన ధనలక్ష్మీ భర్త చనిపోవడంతో ఆమె తల్లి దగ్గరే ఉంటున్నారు. అయితే పది రోజుల కింద ధనలక్ష్మీకి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. రాంగ్ నెంబర్ అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది. కానీ ఫోన్ చేస్తున్న పెరియార్ స్వామి మాత్రం తరుచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. ఏదైనా మాట్లాడొచ్చుగా అంటూ విసిగించేవాడు. నూవెవరో నాకు తెలియదు అన్నా వినకుండా పదే పదే విసిగించేవాడు. కొన్నిసార్లు ఆ సంభాషణ హద్దులు మీరేది. ఆమెతో అసభ్యంగా మాట్లాడటంతో ధనలక్ష్మీకి చిర్రెత్తుకొచ్చేది. ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి.. పెరియార్ స్వామి సంగతేందో తేలుద్దామని ఇంటికి రమ్మని పిలిచింది.

ఈ విషయం చెప్పగానే పెరియార్ స్వామి ఎగిరి గంతేసి ధనలక్ష్మీ ఇంటికి వెళ్లాడు. మంగళవార మధ్యాహ్నం వాళ్లింటికి రాగా.. ఆ మహిళలిద్దరూ పెరియార్ స్వామిని కడిగేశారు. వద్దని చెబుతున్నా ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెరియార్ స్వామికి విషయం అర్థమైంది. దీంతో అతడు కూడా మెతకగా ఉంటే లాభం లేదని నోరుకు పనిచెప్పాడు. మాటా మాటా పెరిగింది. గొడవ ఎక్కువైంది.

ఇదే క్రమంలో గొడవ ముదిరి కొట్టుకునే స్థాయికి చేరింది. తల్లీకూతుళ్లిద్దరూ కలిసి.. పెరియార్ స్వామిని చెట్టుకు కట్టేశారు. అతడిని దారుణంగా కొట్టారు. దీంతో అతడికి ఒళ్లంతా గాయలయ్యాయి. అయినా వాళ్ల కోపం చల్లారలేదు. పెరియార్ స్వామి పూర్తిగా అపస్మారక స్థితికి వెళ్లేదాకా వారిద్దరూ అతడిని కొడుతూనే ఉన్నారు. దీంతో పెరియార్ స్వామి మృతి చెందాడు.

అయితే ఈ మర్డర్ కేసు తమ మీదకు రాకూడదని నిశ్చయించుకున్న తల్లీకూతుళ్లు.. ఆ మృతదేహాన్ని వాళ్లింటికి దగ్గరే ఉన్న రైలు పట్టాల మీద పడేశారు. ఈ ఘటనను చూసిన పలువురు స్థానికులు.. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 22, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading