• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MOTHER AND DAUGHTER ENDS THEIR LIFE AFTER DISPUTE OVER LIQUOR IN CHITTOOR SK

ఏపీలో మద్యం నింపిన విషాదం.. ఉరేసుకొని తల్లీకూతురు ఆత్మహత్య

మద్యం నింపిన విషాదం.. ఉరేసుకొని తల్లీకూతురు ఆత్మహత్య

తాగుడుకు బానిసైతే కుటుంబం నాశనమవుతుదని బుద్ధి చెప్పినందుకు.. ఆమెపై దాడిచేశాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అతడి భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు.

  • Share this:
    ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. మాయదారి మద్యం ఓ కుటుంబంలో విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని కిట్టన్ మిషన్ వీధిలో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని వారించినందుకు భార్యను చితకబాదాడు భర్త. తాగుడుకు బానిసైతే కుటుంబం నాశనమవుతుదని బుద్ధి చెప్పినందుకు.. ఆమెపై దాడిచేశాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అతడి భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

    లాక్‌డౌన్ 3పై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారు. ఇన్ని రోజుల తర్వాత వైన్ షాప్‌లు ఓపెన్ కావడంతో మద్యం బాబుల ఆనందానికి అవధులు లేవు. రేట్లు పెంచినప్పటికీ మద్యం కోసం ఎగబడుతున్నారు. ఏపీలో ఉదయం నుంచే వైన్ షాప్‌లకు జనాల తాకిడి పెరిగింది. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్కల చేయకుండా ఒక్క సీసా మందు కోసం కష్టపడుతున్నారు మద్యం ప్రియులు. పలు చోట్ల మందుబాబు సామాజిక దూరం పాటించడం లేదు. వందలాది మంది ఒక్క చోట చేరి గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: