మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...

Chicago, USA : ఇంటికి వచ్చేందుకు బయలుదేరిన లోపెజ్ ఏమైందన్నది మిస్టరీగా మారింది. దాదాపు నెల రోజులవుతున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 12:51 PM IST
మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఏప్రిల్ 23, 2019. మధ్యాహ్నం 3 గంటల టైం. చికాగోలోని ఓ హైస్కూల్ నుంచీ బ్లాక్ హోండా సివిక్ కారులో బయలుదేరింది లోపెజ్. 9 నెలల ప్రెగ్నెంట్ అయిన ఆమె... ఆ రోజు ఇంటికి రాలేదు. మర్నాడు స్థానిక డే కేర్ నుంచీ ఆమె కుటుంబ సభ్యులకు కాల్ వచ్చింది. ఆమె డే కేర్ సెంటర్‌కి రాలేదనీ, తన మూడేళ్ల కొడుకును తీసుకెళ్లలేదనీ వాళ్లు చెప్పారు. ఇంటికి వచ్చేందుకు బయలుదేరిన లోపెజ్ ఏమైందన్నది మిస్టరీగా మారింది. దాదాపు నెల రోజులవుతున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. లోపెజ్ తల్లి... రాక్వెల్... తన మనవడు తల్లిని చూడాలని ఏడుస్తున్నాడనీ, ఏమీ తినట్లేదనీ బాధపడుతూ చెప్పింది. ఆమె ఏమైందో కచ్చితంగా కనిపెట్టాలని పోలీసులను కోరింది.

అప్పటివరకూ లోపెజ్ కిడ్నాప్ అయివుంటుందనీ, బతికే ఉండి ఉంటుందనీ కుటుంబ సభ్యులు భావించారు. బుధవారంతో వారి ఆశలు సమాధి అయ్యాయి. చికాగోలోని ఓ ఇంటి బయట వున్న చెత్తకుప్పలో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. అవి లోపెజ్‌వేనని తెలిసింది. ఆమె కడుపులో పెరుగుతున్న ఆడ పిల్లను ఎవరో ఎత్తుకుపోయారని తేలింది. లోపెజ్‌ను మెడచుట్టూ తాడు బిగించి చంపేశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో స్పష్టమైంది.

లోపెజ్ శరీర భాగాలు కనిపించిన చెత్తకుప్పకు దగ్గర్లో ఉన్న ఇంట్లో వారిని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు తెలిసింది అసలు నిజం. ఆ ఇంట్లోని 46 ఏళ్ల క్లారిసా, ఆమె బాయ్ ఫ్రెండ్ బోబాక్, ఆమె కూతురు డిసైరీ ఈ హత్యలో చేతులు కలిపినట్లు స్పష్టమైంది.

ఎందుకీ హత్య చేశారని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. క్లారిసా 27 కొడుకు... 2017లో చనిపోయాడు. అప్పటి నుంచీ ఆమెకు ఓ కొడుకు ఉంటే బాగుండనే కోరిక బలంగా కలిగింది. అదే సమయంలో... ప్రెగ్నెన్సీతో ఉన్న లోపెజ్... ఆమె ఇంటి ముందు కారు ఆపి... వాటర్ కావాలని అడిగింది. ఆ సందర్భంలో... వాటర్ ఇచ్చిన క్లారిసా... ఎన్నో నెల అని అడిగింది. తొమ్మిదో నెల అని చెప్పిన లోపెజ్... మగ బిడ్డ అనీ... రెండ్రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారంది. అంతే... ఆ బిడ్డపై కన్నేసిన క్లారిసా... మీరు చాలా అలసటగా ఉన్నారు. కాసేపు మా ఇంట్లో కూర్చొని వెళ్లండి అని ఇంట్లోకి తీసుకెళ్లింది.

లోపెజ్ ఆ ఇంట్లోని హాల్‌లో కూర్చొని ఉండగా... క్లారిసా వేరే గదిలోని తన కూతురు డిసైరీతో ఈ విషయం చెప్పింది. లోపెజ్‌ను చంపేసి... ఆ కడుపులో పిల్లాణ్ని తాను పెంచుకుంటానని కోరింది. మగ సంతానం కోసం ఎదురుచూస్తున్న తన తల్లికి ఇలాగైనా ఓ బిడ్డ దక్కినట్లు అవుతుందనుకున్న ఆ కూతురు... మరో తల్లి (లోపెజ్) ప్రాణం తీసేందుకు వెనకాడలేదు. తల్లీ, కూతురూ కలిసి... లోపెజ్‌ను తమ ఇంట్లోనే చంపేశారు. ఆమె పొట్టను కోసి... మగ బిడ్డను బయటకు తీశారు. ఐతే... ఆ బిడ్డ గిలగిలా కొట్టుకోవడంతో... ఆ పసికందును హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆ మగ బిడ్డకు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదని డాక్టర్లు తెలిపారు.

లోపెజ్‌ డెడ్ బాడీని కొన్ని రోజులు ఐస్‌లో ఉంచిన హంతకులు... ఆ తర్వాత ఆమెను ముక్కలుగా చేసి... శరీర భాగాల్ని చెత్త కుప్పలో పడేశారు. ఇందుకు క్లారిసా బాయ్ ఫ్రెండ్ బోబాక్ సహకరించాడు. ఇలా ఈ ఘోరమైన నేరం... ప్రపంచానికి తెలిసింది. ఓ తల్లికీ, బిడ్డకూ జరిగిన అన్యాయం అందర్నీ కలచివేసింది.

 ఇవి కూడా చదవండి :

పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...

500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...

కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...

తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...
First published: May 17, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading