• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MOTHER AND CHILD SUICIDE AGAINST DOWRY ISSUES IN VIZAG NGS

Andhra Pradesh: తొమ్మిదేళ్ల తరువాత అదనపు కట్నం వేధింపులకు తల్లి కొడుకు బలి.. విషాదంగా మారిన మిస్సింగ్ మిస్టరీ

Andhra Pradesh: తొమ్మిదేళ్ల తరువాత అదనపు కట్నం వేధింపులకు తల్లి కొడుకు బలి.. విషాదంగా మారిన మిస్సింగ్ మిస్టరీ

అదనపు కట్నానికి తల్లి కొడుకు బలి

తొమ్మిదేళ్ల పాటు భర్తతో అన్యోన్యంగా కాపురం చేసింది 36 ఏళ్ల రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులతో సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో అదనపు కట్నం వేధింపులు వెంటాడాయి. తన కష్టాన్ని కడతేర్చాలంటే తనువు చాలించడమే మార్గమని భావించింది.. కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది పాపం.

 • Last Updated:
 • Share this:
  వరకట్న వేధింపులకు ఎందరో వివాహితలు బలవుతున్నారు.. అయినా కొందరు మారడం లేదు. సాధరణంగా పెళ్లైన మూడు నాలుగేళ్ల వరకు ఇలా అత్తింటి వేధింపులు ఎదుర్కొనే ఎందరో మహిళలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.. మరికొన్ని వెలుగులోకి రావడం లేదు. పరువు పోతుందనే భయంతో ఎందరో మహిళలు కష్టాలను, అవమానాలను భరిస్తూ సంసారాన్ని సాగదిస్తున్నారు.. అయితే పెళ్లైన తొమ్మిదేళ్ల తరువాత కూడా వరకట్న వేధింపులకు ఓ మహిళ.. తన కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది అంటే ఎంత అమానుషం..

  తొమ్మిదేళ్ల పాటు భర్తతో అన్యోన్యంగా కాపురం చేసింది 36 రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులతో సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. తన కష్టాన్ని కడతేర్చాలంటే తనువు చాలించడమే మార్గమని భావించిందామె. కుమారుడితో కలసి జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసలో బుధవారం చోటు చేసుకుంది.

  అంతకుముందు తల్లీకొడుకు కలసి ఆలయానికి వెళతామని చెప్పడంతో ఇంట్లో ఎవరికీ వారిపై అనుమానం రాలేదు. బయటకు వెళ్తున్నప్పుడు కూడా అందరితో మాట్లాడుతూ నవ్వుతూనే వెళ్లిందామె. కానీ ఏమైందో ఏమో.. బిడ్డతో సహా పెద్దగెడ్డ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను లేని లోకంలో వదిలేస్తే బిడ్డ కష్టాలు పడతాడని అనుకుందో ఏమో... తనతో పాటు కుమారుడిని కూడా తీసుకుపోయింది. ఘటనలో తల్లి రామకృష్ణమ్మతో పాటు తనయుడు 8 ఏళ్ల హర్షవర్ధన్‌ మృతిచెందాడు. ఈ సంఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ప్రకారం పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన మాదిరెడ్డ సోమినాయుడుకు రామభద్రపురం మండలం కుంటునవలస గ్రామానికి చెందిన రామకృష్ణమ్మతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్‌, ప్రశాంత్‌లు ఉన్నారు. వివాహం తర్వాత ఐదేళ్ల వరకు వీరి కాపురం సజావుగా సాగింది. పెళ్లి సమయంలో కట్నంగా 3 లక్షలు, బంగారం, సారె సామాన్లు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మళ్లీ కట్నం తీసుకురావాలని రామకృష్ణమ్మను భర్త, అత్తింటి వారు వేధించడం ప్రారంభించారు. వీరి ఇంట్లోనే అత్త, ఆడపడుచు కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆ వేధింపులు భరించలేక రామకృష్ణమ్మ మానసికంగా ఇబ్బందులు పడినట్టు చెబుతున్నారు. ఆ బాధతోనే ఈ నెల 15వ తేదీన పెద్ద కొడుకును వెంటబెట్టుకుని ఇంటి నుంచి బయటకు బయలుదేరిందని.. క్కడికి వెళ్తున్నారని కుటుంబ సభ్యులు అడగ్గా ఆలయానికని చెప్పిందని. తిరిగి సాయంత్రానికి కూడా రాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెబుతున్నారు.

  ఈ విషయాన్ని సోమునాయుడు ఫోనులో తన మావయ్య సింహాచలంకు చెప్పారు. దీంతో తన కుమార్తె, మనువడు కనిపించడం లేదంటూ సింహాచలం ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలిస్తుండగా.. పెద్దగెడ్డ జలాశయం పరిసరాల్లో తల్లీకుమారులు కనిపించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. అనుమానంతో పోలీసులు సోమ, మంగళవారాల్లో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం హర్షవర్ధన్‌ మృతదేహం జలాశయం ఒడ్డున తేలింది. రామకృష్ణ మృతదేహం స్పిల్‌వే కింద చిక్కుకుపోవడంతో ప్రధాన తూము ద్వారా నీరు విడుదల చేశారు. ఆమె మృతదేహం ప్రవాహంతో బయటకు కొట్టుకు వచ్చింది. సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

  తన కుమార్తె, మనవడు ఆత్యహత్యకు అత్తింటి వారి వేధింపులే కారణమని మృతురాలి తండ్రి సింహాచలం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహ సమయంలో 3 లక్షల రూపాయలకుపైగా కట్నం, మూడు తులాల బంగారం పెట్టామని, నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం అత్త లక్ష్మీకాంతం, మామ ఆదినారాయణ, ఆడపడుచు భర్త వైకుంఠం తిరుపతిరావు, వరుసకు బావ మదుసూధనరావు తరచూ తన కుమార్తెను వేధించేవారని ఆరోపించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం రిపోర్ట్ కోసం సాలూరు సీహెచ్‌సీకి తరలించినట్లు హెచ్‌సీ ఎస్వీ ప్రసాద్‌ తెలిపారు.
  Published by:Nagesh Paina
  First published: