డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించింది. దీనితో చంచల్ గూడ జైలు నుంచి ఎడ్విన్ (Edwin) విడుదల అయ్యాడు. అయితే పీడీయాక్ట్ (Pd Act) ను ప్రయోగిద్దాం అనుకునే సమయానికే ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించినట్లు తెలుస్తుంది. కాగా కొన్ని నెలల నుంచి ఎడ్విన్ (Edwin) పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే నారాయణ బోర్కర్ (Narayana Borker) ఇచ్చిన సమాచారంతో 3 నెలలు గోవాలో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే పట్టుమని 10 రోజులు కాకుండానే ఎడ్విన్ (Edwin) కు బెయిల్ లభించడం గమనార్హం.
ఎడ్విన్ (Edwin) కేవలం హైదరాబాద్ కే కాదు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలుస్తుంది. అయితే 3 నెలల క్రితం ఇదే కేసులో నారాయణ బోర్కర్ (Narayana Borker) ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఎడ్విన్ (Edwin) తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. గత 90 రోజులకు పైగా ఎడ్విన్ (Edwin) గోవాలోనే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పక్కా నిఘాతో పోలీసులు ఎడ్విన్ (Edwin) ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గోవా (Goa) లో పట్టుబడిన ఎడ్విన్ (Edwin) ను పోలీసులు హైదరాబాద్ (Hyderabad) కు తీసుకొచ్చారు.
ఇక నిందితుడు ఎడ్విన్ (Edwin) గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుండే హైదరాబాద్ సహా పలు రాష్ట్రాలకు డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. డ్రగ్స్ (Drugs) సరఫరాకు సంబంధించి ఎడ్విన్ (Edwin) కీలక నిందితునిగా ఉన్నాడు. అయితే అతడిని పట్టుకోడానికి ఇక్కడి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ నిందుతుడు ఎడ్విన్ (Edwin) కొన్నిరోజుల ముందే హైద్రాబాద్ (Hyderabad) లోని వివిధ కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అయితే అతని ప్రయత్నాలు ఫలించలేదు. నాంపల్లి సెషన్స్ కోర్టు (Nampalli Seshans Court) అతడి పిటీషన్ ను తిరస్కరించింది. ఈ క్రమంలో నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ కూడా ముందస్తు బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురైంది.
ఇక ఎడ్విన్ (Edwin) గోవాలో మృతి చెందిన బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Drugs case, Hyderabad, Telangana, Telangana crime news