తన లైంగిక వాంఛ తీర్చుకోవాలని... ప్రియురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి...

యువతితో పరిచయాన్ని అడ్డుపెట్టుకొని తనతో సెక్స్ చేయాలని వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి అతడిని దూరంగా పెట్టింది. దాంతో ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని నిందితుడు ప్రయత్నం చేశాడు.

news18-telugu
Updated: September 15, 2019, 10:46 PM IST
తన లైంగిక వాంఛ తీర్చుకోవాలని... ప్రియురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 15, 2019, 10:46 PM IST
తన ప్రేమను అంగీకరించలేదని పగ పెంచుకున్న యువతిని సోషల్‌మీడియా వేదికగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడొక ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ కు చెందిన నిందితుడు ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే ఆసుపత్రికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో స్నేహం చేసిన నిందితుడు ఆమెతో కలిసి ఫొటోలు దిగడం, వీడియోలు, సెల్ఫీలు దిగేవాడు. అయితే ఆ యువతితో పరిచయాన్ని అడ్డుపెట్టుకొని తనతో సెక్స్ చేయాలని వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి అతడిని దూరంగా పెట్టింది. దాంతో ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని నిందితుడు ప్రయత్నం చేశాడు.

దీంతో గతంలో తనతో దిగిన సెల్ఫీలను సోషల్‌మీడియాలో పోస్టు చేసి, మార్ఫింగ్ ఫోటోలను పోస్టు చేస్తూ ఆమె పరువు తీయడం ప్రారంభించాడు. దీంతో నిందితుడి వేధింపులు ఆపకపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలను సేకరించి, అదుపులోకి తీసుకొని విచారించి అదుపులోకి తీసుకున్నాడు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...