హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shameful Incident: ఈ అమ్మాయి చేసిన పనికి ఏమనాలి అసలు.. ఇంత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందో...

Shameful Incident: ఈ అమ్మాయి చేసిన పనికి ఏమనాలి అసలు.. ఇంత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందో...

నిందితురాలు సౌమ్య

నిందితురాలు సౌమ్య

చాలా ప్రేమ కథలు కంచికి చేరవు. ఏదో ఒక కారణంతో కొన్ని ప్రేమ జంటలు బ్రేకప్ చెప్పుకుని చెరో దారి చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మాజీ లవర్‌ను ఇబ్బంది పెట్టకూడదని కొందరు భావిస్తే.. మరికొందరు మాత్రం బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా మాజీ లవర్‌ను వేధిస్తుంటారు.

ఇంకా చదవండి ...

చాలా ప్రేమ కథలు కంచికి చేరవు. ఏదో ఒక కారణంతో కొన్ని ప్రేమ జంటలు బ్రేకప్ చెప్పుకుని చెరో దారి చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మాజీ లవర్‌ను ఇబ్బంది పెట్టకూడదని కొందరు భావిస్తే.. మరికొందరు మాత్రం బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా మాజీ లవర్‌ను వేధిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా అమ్మాయిలే బాధితులవుతుంటారు. కానీ.. ఈ ఘటనలో మాత్రం బాధితురాలు ఆమె మాజీ ప్రియుడి భార్య. తనకు బ్రేకప్ చెప్పి పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని ఓ మాజీ ప్రియురాలు మాజీ ప్రియుడిపై పగ పెంచుకుంది.

అతనిని పెళ్లి చేసుకున్న యువతి పరువు తీయాలని భావించింది. ఆమె ఫొటోలను సంపాదించి ఆ ఫొటోలను అశ్లీలంగా కనిపించేలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. అందుకు పెద్ద ప్లానే వేసింది. ఏదైనా తేడా వచ్చినా తను దొరికిపోకుండా ఉండేందుకు పెద్ద హనీ ట్రాప్ నడిపి.. ఆ ట్రాప్‌లో పడిన వారి పేరుతో, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసింది. ఆ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తన మాజీ ప్రియుడి భార్య మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది.

ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురానికి చెందిన సౌమ్య అనే 32 ఏళ్ల యువతి, ఓ యువకుడు కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇటీవల.. ఆ యువకుడికి మరో యువతితో వివాహమైంది. ఈ పరిణామం సౌమ్యకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఆ యువతి పరువు తీయాలని భావించింది. అందుకోసం పెద్ద ప్లానే వేసింది. సౌమ్యకు ఫొటోలను ఎడిట్ చేయడంలో అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే తన మాజీ ప్రియుడి భార్య ఫొటోలను సంపాదించుకుని ఆ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీయాలన్నది సౌమ్య ఆలోచన.

ఇది కూడా చదవండి: Daughter-In-Law: ఆగస్ట్ 25న వీళ్లిద్దరికీ పెద్దలు పెళ్లి చేశారు.. కానీ ఈ కోడలు ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు..

అయితే.. నేరుగా తానే పోస్ట్ చేస్తే పోలీసులకు దొరికిపోతుందని భావించిన సౌమ్య అందుకోసం మరో ప్లాన్ వేసింది. హనీ ట్రాప్‌కు తెరలేపింది. దాదాపు వంద మంది యువకులను హనీట్రాప్ ద్వారా తన దారిలోకి తెచ్చుకుంది. వారితో.. అశ్లీల రీతిలో చాటింగ్ చేయడమే కాకుండా వారిని పూర్తిగా తన మాయలో పడేసేందుకు తన ప్రైవేట్ పార్ట్స్‌ను ఫొటోలుగా తీసి పంపి న్యూడ్‌గా చాట్ చేసేది. అలా ఆ యువకులు తన దారిలోకి రాగానే వారి ఫోన్ నంబర్లతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసేది. ఈ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేందుకు ఓ యువకుడు సౌమ్యకు సహకరించాడు. అలా దాదాపు వందకు పైగా ఫేక్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం ఐడీలను క్రియేట్ చేసి ఆ అకౌంట్లలో తన మాజీ ప్రియుడి భార్య మార్ఫింగ్ చేసిన ఫొటోలను సౌమ్య పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు కాస్తా వైరల్ కావడంతో బాధితురాలి తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైంకు బదిలీ చేయడంతో సౌమ్య బండారం మొత్తం బయటపడింది. సైబర్ క్రైం పోలీసులు ఆ న్యూడ్ ఫొటోలు పోస్ట్ అవుతున్న సిస్టమ్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసి సౌమ్యను, ఆమెకు సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Kerala, Nude photos, Social Media

ఉత్తమ కథలు