హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘దొంగ డ్యాన్సర్’... పగలు డ్యాన్స్ షోలు... రాత్రిళ్లు ఇళ్లల్లో చోరీలు...

‘దొంగ డ్యాన్సర్’... పగలు డ్యాన్స్ షోలు... రాత్రిళ్లు ఇళ్లల్లో చోరీలు...

పగలు స్టేజ్ షోలతో మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు... రాత్రి ముఠాతో కలిసి ఘరానా చోరీలు... డ్యాన్సర్ దొంగల ముఠా అరెస్ట్...

పగలు స్టేజ్ షోలతో మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు... రాత్రి ముఠాతో కలిసి ఘరానా చోరీలు... డ్యాన్సర్ దొంగల ముఠా అరెస్ట్...

పగలు స్టేజ్ షోలతో మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు... రాత్రి ముఠాతో కలిసి ఘరానా చోరీలు... డ్యాన్సర్ దొంగల ముఠా అరెస్ట్...

  పగలు స్టేజ్ షోలతో ఫుల్లు బిజీగా ఉండే ఆ డ్యాన్సర్... రాత్రి అయ్యేసరికి పూర్తిగా మేకప్ మార్చేస్తాడు. దొంగగా మారి... స్నేహితులతో కలిసి ఇళ్లల్లో చోరీలు చేస్తున్నాడు. న్యూఢిల్లీలో వెలుగుచూసిన ఈ ‘దొంగ డ్యాన్సర్’ ఉదంతం స్థానికింగా సంచలనం క్రియేట్ చేసింది. న్యూఢిల్లీకి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి... డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతీరోజు ఉదయం డ్యాన్సులు చేస్తూ... వాటిని యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్, పాపులారిటీ కారణంగా మనోడి వీడియోలకు మంచి వ్యూస్ కూడా వచ్చేవి. అయితే వాటిని రూపొందించేందుకు కావల్సినంత డబ్బు లేకపోవడంతో పాటు ఈజీ మనీకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు అరుణ్ కుమార్.

  ఉదయం డ్యాన్స్ వీడియోలు చేస్తూ... రాత్రికాగానే దొంగతనాలు చేసేవాడు. తన డ్యాన్స్ బృందంలోని ఏడుగురు స్నేహితులతో కలిసి కారులో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేసేవారు. ఇతని ముఠాలోని ఒక్కొక్కరూ ఒక్కో విద్యలో ఆరితేరిన వారు. ఒకరు పోలీసులకు చిక్కకుండా వేగంగా కారు దూసుకుపోనివ్వడంలో టాలెంటెడ్ అయితే... మరికడు క్షణాల్లో తాళాలు పగలకొట్టగల నేర్పరి. ఇలా వరుస చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఈ డ్యాన్సర్ల ముఠా... జంగపురా ఎక్స్‌టెన్షన్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఇంట్లో చోరి దొరికిపోయారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 30 సీసీటీవీ కెమెరాల్లో ముఠాలోని ఇద్దరు దొంగల చిత్రాలు కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అరుణ్ కుమార్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు... కూపీలాగగా అసలు విషయం బయటికి వచ్చింది. అరుణ్ కుమార్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి దగ్గర్నుంచి రూ. పది లక్షల నగదు, వజ్రాల ఆభరణాలు, కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.

  ఇవి కూడా చదవండి...

  మంచులో చిక్కుక్కున్న 3వేల మంది టూరిస్టులు... కాపాడిన ఆర్మీ సాయం...


  ప్రేమకి మతం మకిలీ... ఒకే తాడుకి ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య...


  మీ ఫోన్‌లో ‘ఆ వీడియోలు’ ఉన్నాయా... అయితే జైలుకి వెళ్లక తప్పదు...


  దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...


  భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...


  చలి తట్టుకోలేక మంచం కింద హీటర్ పెట్టుకున్నారు... నిప్పంటుకుని...


  8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

  First published:

  Tags: Crime

  ఉత్తమ కథలు