Home /News /crime /

MORE THAN 80 MEN HAVE APPEARED IN COURT SUSPECTED OF THE MOLESTED OF EIGHT WOMEN AND THE ARMED ROBBERY OF A VIDEO PRODUCTION CREW IN SOUTH AFRICA PAH

ఒక్కొక్కరిపై 10 సార్లు అత్యాచారం.. 8 మంది మోడల్స్ ఘటనపై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

South Africa: దక్షిణాఫ్రికా లో జరిగిన 8 మంది మోడల్స్ పై అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.

గత వారం సౌత్ ఆఫ్రికాలోని (South africa) జోహన్నెస్‌బర్గ్‌లో అమానవీయకర ఘటన జరిగింది. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తాజాగా, 80 మంది నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమాన క్రుగర్స్‌డోర్ప్ పట్టణంలోని కొంత మంది మోడల్స్ , వీడియోలను షూట్ కోసం వచ్చారు. అప్పుడు కొంత మంది సాయుధ దుండగులు అక్రమంగా అక్కడికి వెళ్లి, బెదిరించి పాడుబడ్డ భవనంలో 8 మంది మహిళలపై అత్యాచారాలకు (8 modles molested)  పాల్పడినట్లు బాధితులు వెల్లడించారు. దాదాపు.. అఘాయిత్యానికి గురైన వారిలో.. 19 ఏళ్ల నుంచి 37 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఉన్నారు.

వీరిని బలవంతంగా ఒకరితర్వాత.. ఒకరు పదుల సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. అంతే కాకుండా తమను బెదిరిస్తు.. వరుసగా అత్యాచారం చేస్తు ఆతర్వాత.. వస్తువులను కూడా దోచుకెళ్లారని మహిళలు తెలిపారు.
ఈ క్రమంలో.. నిందితులు జోహన్నెస్‌బర్గ్ ప్రాంతంలోని అనేక మూసి ఉన్న గనుల షాఫ్ట్‌లలో బంగారం కోసం తవ్విన జమా-జమాస్ అని పిలువబడే అక్రమ మైనర్లని పోలీసులు గుర్తించారు.



స్థానిక నివేదికల ప్రకారం అక్రమ మైనర్లలో చాలా మంది విదేశీయులు. ఈ ప్రాంతంలో విస్తృతమైన నేరాలకు జమా-జమా ముఠాలు కూడా కారణమని ఆరోపించారు. కాగా, దీనిపై ఆ దేశంలో తీవ్రమైన నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో.. ఇప్పటి వరకు 82 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలపారు. అత్యాచారానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు అత్యాచారానికి గురైన మహిళల DNA నమూనాలను ఉపయోగిస్తామని జాతీయ పోలీసు మంత్రి భేకీ సెలె తెలిపారు.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాలో (South Africa) అమానవీయ సంఘటన జరిగింది.

జోహన్నెస్‌బర్గ్ సమీపంలో మ్యూజిక్ వీడియో షూటింగ్ సమయంలో 8 మోడల్స్ అత్యాచారానికి గురయ్యారు. కాగా, జోహన్నెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న చిన్న పట్టణమైన క్రుగర్స్‌డోర్ప్ శివార్లలో గురువారం జరిగిన దాడిపై ఇప్పటివరకు 20 మంది అనుమానితుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయని పోలీసు మంత్రి భేకీ సెలే తెలిపారు. ఈ వారం దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న పట్టణంలో సంగీత వీడియో షూట్‌లోకి ప్రవేశించిన ముఠా బలవంతంగా ఎనిమిది మంది యువతులపై అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

సామగ్రిని ఆఫ్‌లోడ్ చేసి సెట్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు ముఠా సిబ్బంది, నటీనటులపై దాడి చేసిందని ఆయన విలేకరులతో అన్నారు. బాధిత మహిళలు 18 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని, ఒక మహిళపై 10 మంది పురుషులు, మరొకరు ఎనిమిది మంది అత్యాచారానికి (8 Models Raped During Music Video Shoot) పాల్పడ్డారని సెలె చెప్పారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అధికార పార్టీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులను కూడా బట్టలు విప్పి వారి వ్యక్తిగత వస్తువులను దోచుకున్నారు.

దేశంలో అక్రమంగా దోపిడీ చేసే వ్యక్తులను ప్రస్తావిస్తూ, వీరంతా.. విదేశీ పౌరులుగా కనిపిస్తున్నారని.. ప్రాథమికంగా వారు జమా జమాలు" అని ఆయన అన్నారు. ప్రెసిడెంట్ సిరిల్ రమాఫోసా అదే సమావేశంలో మాట్లాడుతూ నేరస్థులను వీలైనంత తొందరగా పట్టుకొవాలని అధికారులకు ఆదేశించారు. దక్షిణాఫ్రికాలో అత్యాచారం చాలా తక్కువగా నివేదించబడింది. అయితే దేశంలో ప్రతి 12 నిమిషాలకు సగటున ఒక నేరం పోలీసులకు నివేదించబడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, South Africa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు