500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...

HIV AIDS - Pakistan : ఆ గ్రామాల్లోని వందల మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా HIV సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 12:01 PM IST
500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...
ఎయిడ్స్ వ్యాధి పరీక్షలు (ప్రతీకాత్మక చిత్రం)
Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 12:01 PM IST
దక్షిణ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న వసాయో గ్రామం HIV ఆందోళనతో వణుకుతోంది. అక్కడ ఇప్పటికే 500 మందికి HIV Aids సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇంకా ఎవరెవరికి HIV సోకిందోనని అందరూ ఆందోళనతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనంతటికీ కారణం అక్కడి ఓ డాక్టర్. HIV వ్యాధిగ్రస్థుడికి వాడిన సిరంజిని పారేయకుండా దాచి... దానితో వందల మందికి ఇంజెక్షన్లు చేశాడు. ఫలితంగా చాలా మందికి HIV సోకింది. ఈ విషయం వైరల్ అవ్వడంతో... పోలీసులు ఆ గ్రామాల్లో 5 స్క్రీనింగ్ రూంలను ఏర్పాటు చేసి... నెల నుంచీ HIV టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 500 మందికి పైగా HIV సోకినట్లు డాక్టర్లు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులున్నారు. సరిగా శుభ్రం చెయ్యని వైద్య పరికరాల్నీ, సిరంజులను మళ్లీ మళ్లీ వాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు అంచనాకొచ్చారు. దీనంతటికీ కారణమైన డాక్టర్‌ను ఉరి తియ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

aids, monkey, monkeys, hiv vaccine, aids vaccine, hiv aids, aids cure, hiv cure, aids (disease or medical condition), hiv in monkeys, aids monkey, hiv vaccine monkeys, where did hiv come from?, hiv aids in hindi, monkey hiv, rhesus monkey hiv, hiv aids test in hindi, hiv aids information in hindi, brazilian scientists test monkeys for hiv, origin of hiv aids virus, virus, test monkeys, aids news, These kind of oldest Monkeys may help us to fight and cure HIV AIDS, ఎయిడ్స్, హైచ్ ఐ వీ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన, ఎయిడ్స్ రాకుండా ఏం చెయ్యాలి?, ఎయిడ్స్ వ్యాధికి కారణాలు, ఎయిడ్స్ వ్యాధి తగ్గుతుందా? ఎయిడ్స్ వస్తే, హైచ్ఐవీ వ్యాధిగ్రస్థులు, హైచ్ఐవీ వైరస్,
ప్రతీకాత్మక చిత్రం


ఇంకా ఎంతమందికి వ్యాధి సోకిందనేది తేలేందుకు స్థానికులందరిపైనా వైద్య పరీక్షలు జరిపితే గానీ తేలదు. నిసార్ అహ్మద్ అనే యువకుడికి ఏడాది కూతురుంది. మూడు రోజుల కిందట ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా HIV పాజిటివ్ అని తెలియడంతో... ఆ కుటుంబం చిన్నారిని చూస్తూ కన్నీరు పెడుతోంది. ఇంతమంది చిన్నారుల ప్రాణం తీస్తున్న ఆ డాక్టర్‌కి కూడా ఎయిడ్స్ రావాలంటూ అతను ఆవేశంగా అన్నాడు. ఇమామ్ జాదీ అనే పెద్దాయన మనవడికి కూడా వ్యాధి సోకింది.

ఆ గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి గురించి తెలియనివాళ్లు కూడా ఉన్నారంటే... అది ఎంత వెనకబడిన గ్రామమో మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిడ్స్‌ సోకితే నయం కాదు. దాన్ని మరింత పెరగకుండా ఉండేలా నియంత్రించేందుకు మాత్రమే మందులు ఉన్నాయి. ఎయిడ్స్ సోకిన తర్వాత మాగ్జిమం 12 ఏళ్లలో చనిపోతున్నారు. ఆసియాలో ఎయిడ్స్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లో దాదాపు 6 లక్షల మంది నకిలీ డాక్టర్లున్నారు. అలాంటి వాళ్లు ఇలాంటి వ్యాధులు సోకేలా చేస్తున్నారు. ఈ విషయాలు తెలుసుకొని... ఆ గ్రామస్థులంతా కన్నీరు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :

కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...
Loading...
తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...

అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్

పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...