• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MORE THAN 13 THOUSAND MOBILE PHONES HAVE AN IMEI NUMBER IN MEERUT SK

ఒకే IMEI నెంబర్‌పై 13వేలకు పైగా మొబైల్ ఫోన్‌లు.. ఏం జరుగుతోంది?

ఒకే IMEI నెంబర్‌పై 13వేలకు పైగా మొబైల్ ఫోన్‌లు.. ఏం జరుగుతోంది?

(ప్రతీకాత్మక చిత్రం)

రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ నిపుణులు లోతుగా విశ్లేషించగా.. అదే IMEI నెంబర్‌పై ఏకంగా 13557 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ చైనాకు చెందిన ఒకే కంపెనీకి చెందిన ఫోన్లని తెలిపారు.

  • Share this:
    ప్రతి మొబైల్ ఫోన్‌కు 15 అంకెల IMEI (International Mobile Equipment Identity) నెంబర్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఐడెంటిటీ కోసం ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. రెండు సిమ్ స్లాట్స్‌తో వచ్చే స్మార్ట్‌ ఫోన్‌లకు రెండు IMEI నెంబర్లు ఉంటాయి. ఏ రెండు మొబైల్ ఫోన్‌లకు ఒకేరకమైన IMEI నెంబర్ ఉండదు. అంతేకాదు IMEI నెంబర్ లేని ఫోన్‌లను నకిలీ హ్యాండ్ సెట్లుగా గుర్తిస్తారు. మొబైల్ ఫోన్ అపరహరణకు గురైనప్పుడు ఈ నెంబరే కీలక పాత్ర పోషిస్తుంది. ఐతే యూపీలోని మీరట్ పట్టణంలో IMEIకి సంబంధించిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే IMEI నెంబర్‌తో ఏకంగా 13వేలకు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

    మీరట్ జోన్ ఏడీజీ చెప్పిన వివరాల ప్రకారం.. డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి మొబైల్ ఫోన్ ఇటీవల పాడయింది. దాన్ని సదరు కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్‌లో ఇచ్చి రిపేర్ చేయించాడు. ఐతే మొబైల్ ఫోన్‌ను తీసుకున్న తర్వాత దాని IMEI నెంబర్ మారిపోయింది. అదేంటి ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఉంటే.. ఇప్పుడు ఇంకో నెంబర్ ఉందని ఆశ్చర్యపోయాడు. ఏదో తేడాగా ఉందని..సైబర్ క్రైమ్ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ నిపుణులు లోతుగా విశ్లేషించగా.. అదే IMEI నెంబర్‌పై ఏకంగా 13557 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ చైనాకు చెందిన ఒకే కంపెనీకి చెందిన ఫోన్లని తెలిపారు.

    ఒకే IMEIతో ఉన్న ఆ ఫోన్లన్నీ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని యూపీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
    దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా? లేదంటే ఏదైనా మోసపూరిత కారణముందా? అన్న దానిపై ఆరాతీస్తున్నారు. ఏదేమైనా ఒకే IMEI నెంబర్‌తో ఇన్ని ఫోన్లు ఉండడం నేరమని.. సదరు కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తామని తెలిపారు. తప్పు చేస్తే ఎవ్వరినీ వదలిపెట్టబోమని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు