• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MORE THAN 12 MEMBERS TOOK LOAN FROM BANK WITH FAKE PASSBOOKS ARRESTED IN RAMAGUNDAM AK KNR

Ramagundam: నకలీ పాస్ పుస్తకాలతో రెండు కోట్ల రుణం.. నిందితుల అరెస్ట్

Ramagundam: నకలీ పాస్ పుస్తకాలతో రెండు కోట్ల రుణం.. నిందితుల అరెస్ట్

పోలీసుల అదుపులో నిందితులు

Ramagundam: సంవత్సర కాలం గడిచిన రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించగా నకిలీ పాసుపుస్తకాలని తేలింది. దీంతో 153 మంది రైతులపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

 • Share this:
  పెద్దపల్లి జిల్లా రామగిరి మరియు ముత్తరాం మండలలో నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి బ్యాంక్ రుణాలు ఇప్పించిన 12మంది ముఠా సభ్యులను రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులు, పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. వీరితో పాటు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని అందులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఒక విఆర్వో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. 2016-18 సం. మధ్య 153 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో నిందితులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో కోటి 99లక్షల 89 వేల రూపాయల రుణం తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

  సంవత్సర కాలం గడిచిన రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించగా నకిలీ పాసుపుస్తకాలని తేలిందని.. దీంతో 153 మంది రైతులపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రదారి అయిన పందుల ప్రభాకర్ తో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

  మరో ఐదుగురు పరారీలో ఉన్నారని సిపి సత్యనారాయణ తెలిపారు. రుణాలు తీసుకున్న రైతులను బాధితులుగా, సాక్షులుగా పరిగణించి కేసు విచారణ చేపట్టామని నకిలీ పాసుపుస్తకాలు ఎక్కడినుండి తెచ్చారు, దీనికి ఎవరెవరు సహకరించరు అనే కోణంలో అరా తీస్తున్నామని సత్యనారాయణ తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు